పుట:Kasiyatracharitr020670mbp.pdf/77

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నిన్ని తీసుకున్నాను. వారి సామనున్ను బంట్రోతులకు నలుగురికి భోజన సామానున్ను తేను ఒక కావటివాని కూడా తీసుకోన్నాను. నాపరివారమైన్ 25 మంది బ్రాంహ్మణులకు 5 దినముల మెనూను (భత్యము) తీసుకొని 25 వ తేది ఉదయాన 3 ఘంటలకు ఆత్మకూరు వదిలి 4 కోసుల దూరములో నుండే నాగులోటి అనేగుడి లో ఘంటకు ప్రవేశించినాను. దోవలో రాధాపురము, కృష్ణాపురము, వెంకటాపురము, సిద్ధాపురమున్ననే గ్రామములున్నవి. బహు చిన్నవి. చెంచు వాండ్లు, యితరులున్ను కలిసి కాపురమున్నారు. ఆ వెంకటాపురము వరకు భాట సరాళము; వెల్లడిగా నున్నది. అది మొదలు నాగులోటి గుడివరకు భాట సరాళమయినా యిరుపక్కలనున్ను దట్టమయిన అడివి. ఆ సిద్ధాప్;ఉరములో చెంచువాండ్లకుగాను నవాబు మనుష్యులు మనిషి 1 కికె 3 డబ్బులు హాళ్ళీలు పుచ్చుకొనుచున్నారు. డబ్బులు అనగా చెన్నపట్టణపు రెండు దుడ్లు. అక్కడ అణాలు, అర్ధణాలు, పావులాలు దొరకవు. అక్కశడ దబ్బులు మార్చి పెట్టుకొని సెలవు చేయవలసినది. అణాకు మూడుడబ్బులవుచున్నవి. ఆడబ్బులు ముందరి పట్నం లింగిశెట్టి దుడ్లవలెనే అరిగిపోయి యున్నవి. ఆ నాగులోటి వరకు సవారీ మనుష్యులున్ను సాధారణముగా పోవచ్చును. నాగులేటిలొ సిద్ధాపురములో కాపురమున్న చెంచువాండ్లు వేటకు రాగా వారింజూడవలసినదేగాని యితరులు పరిష వారికి కనుబడదు. ఆ గుడి మజిలీ చేసి దిగను నయిపు (వీలు) గా జలవసతి కలిగి యున్నది. ఆ గుడి వీర భద్రస్వామిది. ఒక జంగము ఆత్మకూరిలోనుంచి వారానికి 2 ఆవృత్తులు వచ్చిపూజచేసి పొవుచున్నాడు. అక్కడ మధ్యాహ్న భోజనము చేసుకొని 3 ఘంటలకు బయలు దేరి అక్కడికి అయిదు కోసుల దూరములో నున్న పెద్దచెరువు అనే యూరు 9 గంటలకు చేరినాను. నాగులోటి వదిలనది మొదలు కోసేడు దోవపర్యంతము కష్టమయిన కొండ యొక్కుడు, దిగుడుగానున్నది. మెట్లు బాగా కట్టియున్నవి. ఆ కోసెడు మిక్కిలి ప్రయాస. అవతల 2 కోసులు ఎక్కడము, దిగడము లేక