పుట:Kasiyatracharitr020670mbp.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నీళ్ళు ఒంటక జ్వరము, మహోదరము, సోభ మొదలయిన రోగములు కలుగుచున్నవి. శ్రీశైలమున గుడికి సమీపముగా 20 చెంచుగుడిశేలున్నవి. వారున్న ఆ గుడిశెలు వదిలి భాద్రపద మాసములో వలస పోవుచున్నారు. అప్పటికి వర్షాకాలము తీరి యీగెల ఉపద్రవము కలుగుచున్నది. అది సహించతగినది కాదు. గుడివద్ద స్వామికి ఆవులు 100 దనుక నున్నవి. కడప విడిచిన వెనుక ఆవుపాలు, పెరుగున్ను కండ్ల చూడవలెనంటే శ్రీశైలముమీద చూడవలసినది గాని ఇతర స్థలములలో ఆవులను మాత్రము కండ్ల చూడవచ్చును. ఆవుపాలు తీసుటలేదు, దూడలకు విడిచిపెట్టుచున్నారు. అంత జాగ్రత్తగా ఈ దేశస్థులు పసువులను కాపాడిన్ని, దున్నడముకు ఎద్దులు నెల్లూరుసీమనించి తెచ్చే వారివద్ద హమేషా వారికి కొనవలసి యున్నది. ఎనుములు పాడికే గాని అచ్చటి దున్నలు ఆభూమిని నిగ్గి దున్న నేరవు. తడవకు 18-20 వరహాలు పెట్టి యెద్దులను కొనుచున్నారు. ఆ యాత్మకూరి కాపురస్థులు అనేక పర్షన్ వాండ్లను గొప్ప, చిన్నలను చూచి మెరుగైనవారై యున్నారు. ముసాఫరులకు దేవి యాచకులయిన తెనుగు బ్ర్రాంహ్మణులు రెండిండ్లవారున్ను, స్వామి యాచకుడయిన జంగవాడొకడున్ను - వీరే స్థల మివ్వవలసినది గాని, యితరుల యిండ్లు గొప్పలయినను స్థల మివ్వరు. 2-3 చిన్న దేవస్థలములు, చావిళ్ళున్ను న్నవి. తప్పితే అందులో దిగవలసినది. ఆయాత్మకూరినించి పట్టణపు షవారీల మీద కష్టముగా శ్రీశైలపర్వతమునకు పోయి చేరవచ్చునని తెలియనందుచేత మూడు డోలీలు 2 రూపాయీలకు చేయించినాను. వాటిని నొక దినములో అక్కడి వడ్లవాడు చేసినాడు. అక్కడి రూపాయికిన్ని చెన్నపట్టణపు రూపాయికిన్ని సుమారు కాలురూపాయి భేదమున్నది. పట్టణపు రూపాయి 1 కె అక్కడి రూపాయి12 ఎనిమిదిమంది కూలి బోయీలను అక్కడి వారిని శ్రీశైలమునకు పోయి రాగలందులకు జనము 1 కి రూపాయిలు 4 లెక్కను కుదుర్చుకొన్నాను. నా వుప్పాడాబోయీలను 8 మందిన్ని వారికి సామాను తేను 3 బోయీలనున్ను నాసామాను తేను నాకావటి వాండ్లను ఆర్గురు