పుట:Kasiyatracharitr020670mbp.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అడవినడుమ నున్నది. ఆ దినము మధ్యాహ్నము 2 ఘంటలకు బయలుదేరి 2 ఘడియల ప్రొద్దు కలదనంగా ఆమడదూరమున నుండే పేంపెంట్ అనే గ్రామము చేరినాను. దోవ అడివి బలసినది. మృగుభయము కలదు. గులక, రేగడ కలసిన భూమి. ఆ యూరు నవాబు యిలాకాలో చేరినది. భెబందు గ్రామము. చిన్నయిండ్లు పదార్ధాలు విశేషముగా దొరకవు.

13 తేదీ వుదయమైన గడియకు బయలుదేరి ఆమడదూరములోనుండే ఆత్మకూరు చేరినాను. భాట మంచిది. అడివి నిండాలేదు. ఆ యూరు కందనూరు నవాబు తాలూకా ఉద్యోస్థులుండే కనుబాస్థలము. ఆ కందనూరు నవాబు తాలుకా నాలుగు మేటీలుగా పంచి ఒక్కొక్కమేటీకి నొక్కొక్క ఆములుదారుని నేర్పచినాడు, కొంతతాలూకా తన వద్ది నవుకరులకు జీతానికి బదులుగా జాగీరుకా నిచ్చినాడు. ఆ నవాబు, కుంఫిణీకి సుమారు లక్షరూపాయీలు సాలెనా కట్టుచున్నాడు. అతని రాజ్యము భళ్ళారి జిల్లా కలకటరాజ్ఞకు లోబడినది. కలకటరు తరఫున నొక వకీలు కందనూరులో కాపురమున్నాడు. ఆ నవాబు రాజ్యస్థులకు స్వంతముగా నొక ఖాజీకోటు పెట్టి న్యాయవిచారణ చేయుచున్నాడు గాని, జిల్లా కుంఫిణీ కోరటుకు నిమిత్తములేదు. నవుకరులకు జీతము క్రమముగా ముట్టచెప్పడములేదని వదంతిగా నున్నది. అందరికి జీతము బహుస్వల్పము. తాలూకా అములుదారుల మీద అకబరునివీను అని ఒక ఉద్యోగస్థుని ఉంఛియున్నందువలన పనులు హామీ భరాయించి చూడడమునకు నెవరికిన్ని స్రాతంత్ర్యము లేక నున్నది. ఆ యాత్మకూరు దూరము నించి వినడానకు గొప్పయూరు; పేటస్థలము. ప్రతి ఆదివారమున్నుసంతకలదు. సంతలో సకల పదార్ధములు దొరుకునని ప్రసిద్ధి కలిగియున్నది. వచ్ఫివిచారించగా తద్వ్యతిరిక్తముగా నగుపడును. సంతలో ముసాఫరులకు అక్కరలేని పదార్ధాలు విక్రయింపుచున్నారు గాని ఉపయోగించునవి విశేషించి లేవు. ఆయాత్మకూరులో శ్రీశైల స్థలమందలి యాచకులున్ను యాత్రచేయను వచ్చిన వారివద్ద హాశ్శీలు పుచ్చుకునే నవాబు ముసద్దీలున్ను