పుట:Kasiyatracharitr020670mbp.pdf/72

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సవారీలు వెళ్ళడము ప్రయాస. దిగువ అహోబళములో శూద్రగుడిశెలు కొన్ని యున్నవి. యెగువ అవిన్నీలేవు. జనులు దేవాలయములందే దిగవలసినది. చీకారణ్యప్రదేము. మృగభయము గలదు. జలము రోగప్రదము. మనుష్యులు నివసింపను భయపడుచున్నారు. దేవస్థలలు శిధిలము లయినందున జెల్లేడు, పల్లేరు మొలచి యున్నవి. అచ్చట ఫాల్గునమందు బ్రంహ్మోత్సవము. అప్పుడు జనులు వచ్చుచున్నారు. ఉత్సవకాలమందు 200 వరహాలు హాళ్ళీలు వసూలవుచున్నవి. వాటినంతా కందనూరి నబాబు పుచ్చుకొని వెనక గుళ్ళ సంగతినే విచారింపడు. ఈ స్థలములలో ప్రతిఫలించి యున్న పరమాత్మ చైతన్యము, స్వప్రకాశముచేత లోకులకు భక్తిని కలగ చేయుచున్నది గాని, అక్కడ నడిచేయుపచారములు దానికి నేపాటిన్ని సహకారిగానుండలేదు. ఈ 2 స్థలములలోను న్నొక వస్తువున్ను దొరకదు. ఉప్పుతో తొమ్మిదిన్ని బాచపల్లెలో నుంచి తెచ్చుకోవలెను. ఆ రాత్రి అక్కడ నిలిచినాను. బాచపల్లె కుంఫిణీ వారిది. మంచి గ్రామము. 20 వ తేడి పగలు 12 ఘంటలకు గిదువ అహోబళములో నిలిచి చేతనున్న వస్తువులతో నక్కడి బింబములను ఆరాధించి 1 ఘంటకుప్రయాణమై 6 ఘంటలకు శ్రీరంగాపురము చేరినాను. అది 14 ఆమడదూరము. దోవ సరాళము. మిక్కిలి అడివి. పడమరుద్రవఠమనే బస్తీగ్రామ మున్నది. అది కడపజిల్లాలో ఛేరినది. గొప్ప ఫేటస్థలము. కావలసిన వస్తువులు దొరుకును. సరాబు అంగళ్ళు, బ్రాహ్మణ గృహములు గలవు. శ్రీరంగాపురము చిన్నది; బస్తీగ్రామం; కొంఫిణీవారిది; ఇండ్లు చిన్నవి; ఉదకసౌఖ్యములేదు.

22 తేది రాత్రి 3 ఘంటలకు లేచి 8 ఘంటకు ఆమడలో నున్న మహానంది యనే మహాస్థలము చేరినాను. దోవసరాళము. మహాదేవపురము, బసవాపురము అనే బస్తీ గ్రామములు దోవలో నున్నవి. ఆ మహానంది చీకారణ్యములో నున్నది. కొండ సమీపము గుడి చుట్టు సకలవృక్షములు నున్నవి. గుడి సమీపమున ఒక