పుట:Kasiyatracharitr020670mbp.pdf/7

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1830-31 వీరాస్వామయ్య గారు కన్యాకుమారి మొదలు కాశ్మీరం వరకున్నూ భారత దేశ మంతటా రెండు సార్లు తిరిగి 1830-31 మధ్య తాము చూచిన సంగతులూ తమకు తోచిన సంగతులూ దినచర్య గాను, తమ మిత్రుడైన కోమలేశ్వర పురం శ్రీనివాస పిళ్ళ గారికి జాబులు గాను వ్రాస్శారు. అనాటి భారత దేశ స్తితిగతులన్నీ అందులో వర్ణించారు. దానిలో చెన్నపట్నం చరిత్ర కూడ వుంది. దానిని శ్రీనివాస పిళ్ళగారు కాశీ యాత్ర చరిత్ర అనే పేరుతో 1838 లో ప్రకటించారు.

కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళగారు

శ్రీ కోమలేశ్వర పురం శ్రీనివాసపిళ్ళగారు గడచిన శతాబ్దంలో చెన్న పట్టణంలో వుండి ప్రజాసేవ చేసిన ఆంధ్ర ప్రముఖులు. వీరి తండ్రి పేరు మునియప్పిళ్ళ. వీరు సంపన్న గృహస్థులు. చెన్నపట్నంలో క్షామ నివారణ కోసం, 1807 లో స్థాపించిన మణేగారు సత్రానికి 11 మంది దొరలతో పాటు నియమించబడ్డ 9 మంది దేశీయ ధర్మకర్తలలో వీరొకరు; చెన్నపట్నంలో కుంపిని వారి కొలువులో పోలీసు సూపరెంటుగాను, మేస్ట్రేటుగాను, పనిచేసిన వెంబాకం రామనాచార్యులుగారొకరు. ఏనుగుల వీరాస్వామయ్యగారు, వీరు కలిసి 1833లో నందననామ సంవత్సరం కరవులో బీదలకు అన్నవస్త్రాలిచ్చి కాపాడడానికి చాల పాటుపడ్డారు.

శ్రీనివాస పిళ్ళగారు చాల ధర్మాత్ములున్నూ దూర దృష్టి కలవారున్నూ అయి విద్యాభివృద్ధికి తమ యావచ్చక్తినీ వినియోగించారు. ఈయనకు సంఘ సంస్కారమంటే ప్రీతి. వీరు ఉదారమైన భావాలు కలవారు. ఆడ పిల్లలకు విద్య నేర్పవలెననే పట్టుదల కలవారు. స్వయంగా ఒక ఆడపిల్లల పాఠశాల నడిపారు. ఈ యన ప్రజలలో అక్షరజ్ఞానము వ్యాపింప చేయవలెనని చాల కృషి చేశారు. వీరు చనిపోయే టప్పుడు విద్యాదానం కోసం 70 వేల రూపాయలు ధర్మం చేయడం వల్లనే వీరి దేశాభిమానము, విద్యా భివృద్ధి యందు వీరికి గల ఆసక్తీ వెల్లడి అవుతున్నాయి. వీరు చనిపోయిన కొన్నేండ్లకు ఆనిధిలో నుంచి హిందూ బాలికా పాఠశాల యొకటి స్థాపింప బడింది. వీరు చెంద చేసిన ధర్మ నిధిలో నుంచి పచ్చయ్యప్పకళాశాలకు అంటే మూడోపాఠశాల స్థాపింప బడింది.


జార్జినార్టన్ గారు. వెంబాకం రాఘవాచార్యులు గారు

1828 మొదలు 1853 వరకూ మద్రాసు సుప్రీ కోర్టులో అడ్వకేటు జనరలు గా వుండిన జార్జి నార్టన్ దొరగారున్నూ ఇంటర్ ప్రిటరుగా నున్న ఏనుగుల వీరాస్వామయ్య గారున్నూ, శ్రీమాన్ వంబాకం రాఘవాచార్యులు శ్రీనివాస పిళ్ళ గార్లున్నూ ముఖ్య స్నేహితులు. వీరందరూ కలిసి ఆకాలంలో గొప్ప ప్రజాసేవ చేశారు.

పచ్చయ్యప్ప గారు దాన ధర్మాలకోసం చెంద చేసిన లక్షలాది ధనాన్ని వారసులు తినివేసి కూర్చోగా పాత అడ్వకేటు జనరలైన కాంప్టన్ గారు కొత్త అడ్వకేటు జనరలైన నార్టన్ గారు వీరాస్వామయ్య గారు కష్టపడి ఆ దాన ధర్మాలను బయటికి తీసి