పుట:Kasiyatracharitr020670mbp.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చున్నారు. ఆయూరు వసతిగాకపోయినా అవతల మహారణ్యము గనుక విధిలేక అక్కడ దిగవలసి యున్నది. పోష్టాఫీసు వున్నది. యధోచితముగా వస్తువులు దొరుకును. ముసాఫరుఖానా యున్నది.

31 తేది 2 గంటలకు శెట్టిగుంట చేరినాను. దోవ మహారణ్యము, రాతిగొట్టు, మిక్కిలి దొంగలభయముగలది. నడమ మామండూరు కృష్ణాపుర మనే రెండు పాలెగాండ్ల వూళ్ళున్నవి. వారిసహాయములేక మాతుబర్లు నిర్భయంగా ఆ యడవిదాటలేరు. కలకటరు ఆదోవను నిర్భయంగా చేయను చేతగాక నున్నారు. మామండూరుకి ఈవల 8 గడియల దూరాన బాలపల్లె యున్నది. అది మొదలు కడపజిల్లా సరిహద్దు. బాలపల్లెలో ముసాఫరుఖానాయున్నది. ఆభూమి జలము బహురోగప్రదము. అచ్చట రెండుమూడు నదుల వంటి కాలువలు దాటవలెను. కనమ యొకటి దాటవలెను. భాట బహురాతిగొట్టు. ఎక్కుడు దిగుడుగా నున్నది. అక్కడ బహు దట్టమయిన వెదురడవి. ఆ శెట్టిగుంటలో మంచినీళ్ళు చెరు వున్నది. రెండు బ్రాహ్మణుల యిండ్లున్నవి. పేటస్థలము అన్నివస్తువులు దొరకును. బాలపల్లె మొదలుకొని కడప కలకటరు అడవికొట్టి బాట వెడల్పుచేసి అక్కడక్కడ ఠాణా లుంచియున్నారు. కరకరంబాడి నుండి ఆ పాళెగాండ్లను మంచితనము జేసుకొని యిరువైమంది తుపాకీల వారిని శెట్టిగుంట దనుక తెచ్చినాను. నాడు 3 ఘంటలకు శెట్టిగుంట విడిచి ఆమడదూరములో నున్న కోడూరు వద్దనుండే అగ్రహారమువద్ద సత్రము జేరి నాను. కోడూరు బస్తీ. పేటస్థలము ముసాఫరుఖానా యున్నది. బ్రాహ్కణ గృహములేదు. పై యగ్రహారమందు యేమిన్ని దొరకదు. అంగళ్ళులేవు. ఆ బ్ర్రాహ్మణులు పరోపకారులుగాదు.

జూన్ 1 తేది 5 ఘంటలకు లేచి ఆమడ దూరములో నున్న వోరంబాడు 9 ఘంటలకు చేరినాను. అది పేటస్థలము. అన్నివస్తువులు దొరుకును. ముసాఫరుఖానా యున్నది. బాటసరాళము. శెట్టిగుంటనుంచి కోడూరికి అదివిలో దండు భాట యొకటి పోవుచున్నది. పల్లెలమీదుగా కాలిబాట యొకటి పోవుచున్నది. కాలిభాటలో సనా