పుట:Kasiyatracharitr020670mbp.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యాత్రలో ప్రతిదినచర్యలనున్ను ఆయా ప్రస్తావనములలో జగదీశ్వరుడు తనకు తోపచేసిన తాత్పర్యములనున్ను మార్గమందు పరులవల్ల తాను చెందిన సహాయములనున్ను, తనవలె యాత్ర పోవువారు మార్గములో పూర్వముగానే జాగ్రత్త పెట్టుకొనవలసిన విషయములనున్ను క్రమముగా అప్పుడప్పుడు వ్రాసి పంపుచు వచ్చిరి. ఆ పుస్తకమును చూచుటవల్ల యాత్రబోయి చూచి తెలియవలసిన సంగతులన్నీ తెలియుచున్నవి. ఆ పుస్తకము పనయూరి వెంకుమొదలారిగుండా అరవముతొ తర్జుమా చేయించబడి అచ్చు వేయించబడి యున్నది. నాగపూరి వీరాస్వామి మొదలారి మహారాష్ట్రముతో భాషాంతరము చేయించినాడు. ఆ మహారాష్ట్ర పుల్స్తకమును నాగపూరి రెసైడెంటుగారు తాను యింగ్లీషుతో త్రాన్సులేషన్ చేసి ప్రసిద్ధి పరచ తలచి అయ్యవారిని సెలవు అడిగినందుకు వీరు నేనే భాషాంతరము చేయించి పంపుచున్నానని తెలియజేసి కొంత భాషాంతరము చేయించినారు. భగవంతుని కృపవల్ల కొదవయున్ను యే పుణ్యాత్ముల గుండానయినా పూర్తి కావచ్చును.

వందసంఫత్సరపు క్షామము * లో నేను కొంత ధాన్యసంగ్రహము చేసి వుంచడము మేలని చెప్పినందుకు అయ్యవారు మనము ధ్యానము సంగ్రహించి మనము మట్టుకు భుజించి అన్నాతురులై దు:ఖపడే పేదలను చూచుచు జీవించుట అప్రయోకము గనుక తన ప్రయోజనమునకు గాను విస్తరించి జాగ్రత పెట్టుకొన రాదని చెప్పి ఆ దుర్భిక్షములో శక్తి వంచనలేకుండా తాను అన్నప్రదానము చేయుచు యితరులను స్వప్రయోజనమునకు అనురింఛేలాగు అనుసరించి వారినిన్ని పేదల పోషణ విషయమై ప్రవర్తింపజేయుచు ఆ లాగు ప్రవర్తించిన వారిని తాను మిక్కిలీ కొనియాడి సంతోషపెట్టుచు వచ్చిరి.


-

  • నందననామ సంవత్సరపు కరవు 1892-3 మధ్య వచ్చింది. దీనికి గుంటూరు కరవు అనికూడా పేరు.