పుట:Kasiyatracharitr020670mbp.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆయన వుద్యోగములో నుండిన కాలము వరకు ఆ కోర్టు జడ్జీలకు తృప్తిగా నడుచుకొన్నారనేటందుకు దృష్టాంతముగా పెద్ద జడ్జీ యయిన సర్ రాల్ఫు ఫాల్మరు దొరగారు *ఆయనకు వ్రాసి యిచ్చిన టెస్ఠిమోనియాల్ అనే యోగ్యతాపత్రికలో విశేషముగా ఆయన కోర్టులోనున్ను, చేంబరులోనున్ను అలసట లేక బహు నెమ్మదితో పనులు గడుపుచు వచ్చె ననిన్ని, ఆయన తనగొప్ప వుద్యోగపు పనులను మిక్కిలీ నమ్మకముగా జరిపింఛె ననిన్ని మరిన్ని ప్రజల మేలుకోరి స్మృతిచంద్రిక మొదలైన కొన్ని పుస్తకములకు ట్రాన్సులేషన్ చేసెననిన్ని నే నెరిగినంతలో గవర్నమెంటువారి విశేషకృపకు యీ పురుషుడు పాత్రు డయి నట్టు హిందు పెద్ద మనుష్యులలో మరి ఎవరున్ను యెక్కువైన వారి లేరని దృఢముగా నాకు తోచి యున్నదనిన్ని వ్రాయబడి యున్నది.

లోకములో గంగాస్నానమునకు వెళ్ళిన పురుషుడు తన తల్లి దండ్రులకు గంగ తెచ్చి యివ్వడము వాడికె బడియున్నది. యీ మహాపురుషుడు గంగను పడవలు బండ్లు కావళ్ళు వగయిరాల మీద తెచ్చి యీ దేశములో నుండే నాలుగు వర్ణాల వారిలో నున్నుండే గొప్పమనుష్యులగుండా ఆ యా వర్ణములలోని ముఖ్యుల పేళ్ళు తెలుసుకొని వారి కందరికి గంగనున్ను జగన్నాధ పట ప్రసాదములనున్ను యిప్పించెను. అందువల్ల అందరినిన్ని తన బంధుసమానులుగా చూచే వారని స్ఫుటముగా తెలియుచున్నది. ఆయన యాత్ర బోవునప్పుడు #నేను సకృదావృత్తి అక్కడి వినోదములను వ్రాయించి పంపించవలె నని అడుగు కొన్నందుకు


  • సర్ రాల్ పాల్మర్ గారు మద్రాసుసుప్రీము కోర్టులో 18-7-1824 తేదీన న్యాయమూర్తులలో నొకడుగ నియమింపబడినారు. 28-1-1825 వ తేదీన ప్రధాన న్యాయమూర్తి యైనారు. ఈయన 25-10-1835 వ తేదీన పని చాలించుకొన్నారు.
  1. వీరాస్వామయ్యగారు మద్రాసునుండి 18-5-1880 వ తేదీన యాత్రకు బయలుదేరి 3-9-1881 వ తేదీన తిరిగి వచ్చినారు.