పుట:Kasiyatracharitr020670mbp.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పుటలు స్థితిన్ని ద్వీపముల స్థితిన్ని పంచభూత సృష్టిక్రమమున్ను చరాచర స్థితిగరులున్ను జాగ్రత్సస్నసుషుప్త్యవస్థా స్వరూపమున్ను స్థూలదేహ సృష్టిక్రమమున్ను పంచభూతాల వ్యాప్తిక్రమమున్ను బాల్యాద్యవస్థాహేతువులున్ను సత్వరౌజస్తమోగుణకార్యములున్ను స్త్రీలింగ పుల్లింగ నపుసకలింగ శబ్ధముల విభజనమున్ను శాక్తాదిమత సంకేతస్వరూపమున్ను దేవరక్షసాదిసృష్టిభేధ హేదువున్ను భగోళస్థితిక్రమమున్ను ప్రతి దేశానకున్ను అహ:ప్రమాణ భేదములున్ను భూమికి చలనము కలదనేటందుకు హేతువులున్ను చెప్పబడియున్నవి.

      యిందులో నాస్తికులు ఈశ్వరుడులేడు స్వభావముచేతనే ప్రపంచము జరుగుచున్నదని చ్దెప్పినా వారు జ్ఞానులకు దూష్యులు కారనిన్ని జ్ఞానులున్ను పరతత్వమనే వస్తువు ఈశ్వరుడనిగాని ఈశ్వరి అనిగాని స్త్రీలింగ పుల్లింగ ధర్మములు కలదికాదని చెప్పుచున్నారు గనుక యీ వుభయులకున్ను పరతత్వమనిన్ని స్వభావమనిన్ని శబ్ధభేదమేగాని అధన్ భేదము లేదని చెప్పబడియున్నది.
     ఇందులో యీశ్వరుడు పరులకు యీహిందూ దేశమును స్వాధీనపరచినందుకు కారణ మేమంటే అందరున్ను అహింస సత్యము మొదలైన సద్గుణములతోనే నటిస్తే తన చిద్విలాసానకు వ్యతిరిక్తమని యెంచి యిచ్చటివారికి కామ క్రోధాదులను వృద్ధిబొందించి తద్వారా బ్ర్రాహ్మణలగుండా యిచ్చటి క్షత్రజాతిని బొత్తిగా నశింపచేసి వెనక బ్రాహ్మణుల ల్గర్వభంగముకొరకు తురకలను కొన్నాళ్ళు వృద్ధిపరచి మళ్ళీ కరుణతో సాత్వికులయిన యింగిలీషువారికి యీ దేశాధికారముని యిచ్చనాడని చెప్పియున్నది.
  ఇందులో మహమ్మదు మతస్థులు బలాత్కారముగా యితరులను తమ శాస్త్ర ప్రకారము తమ మరములో కలుపుకొనుచు క్రీస్తువులనున్ను హిందువులనున్ను నపుంసకులనుచున్నారు.  మరిన్ని క్రీస్తువులు తురకలను క్రూరులనిన్ని హిం