పుట:Kasiyatracharitr020670mbp.pdf/46

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది                                              పుటలు

లేకపోయినా స్థితికతన్ అయిన విష్ణువుకు రక్షణాధన్ మై అనేక అవరారములు యెత్తవలసి వచ్చినందున అనేక మూర్తి భేదములు కలిగి ఆ ఘాత్రు లు పూజ్యములయినవనిన్ని ఒక విందులో అనేకవిధములయిన భక్ష్యశాకాదులు చేస్తే భుజించే వారికి ఒక్కొక్క దానిమీద రుచిగలిగినట్టు భక్తులకు వొక్కొక్కమూర్తి మీద భక్తి కుదురుననిన్ని చెప్పబడియున్నది.

యిందులో యెట్టివానికిన్ని సరివారిలో తానుగొప్ప పడవలెననేకోరికే కలిగి యుంచున్న'దనేటందుకు బోయీలు సవారీ మోసుట ప్రయాసయైనా తమజతలో తాము గౌరవపడవలెనని ప్రయాసపడుట దృష్టాంతముగా చెప్పబడియున్నది.

ఇందులో దాక్షిణాత్యులకున్ను, ఔత్తరీయుల కున్ను ఆచారభేదమున్ను ధైర్యస్థైర్య భేదములున్ను కలిగిబున్నదనిన్ని దక్షిణదేశము వుష్ణభూమి గనుక అప్పటివారిక్ జఠరాగ్నిమందించి అల్పాహారములు భుజించుటవల్ల హృదయ కలము దృఢముతప్పుటవల్ల ధైర్యములేక చాంచల్యము కలిగి వుండుటవల్లనే వారి కడతే రడానకు పెద్దలుగుండా రాజోపచారములతో అనేక దివ్యదేశములు కల్పించబడిన వనిన్ని ఉత్తర దేశము శీతభూమియై నందున అచ్చటి వారికి అగ్నిపుష్టి గలిగి గురువైన వస్తువులను భుజించుటవల్ల ధైర్యస్థైర్యములు కలిగి చిత్త చాంచల్యము లేక జ్ఞానముద్వారా కడతేరగలరనే తాత్పర్య్హముతో విశేషించి దివ్యదేశములు కల్పించబడలేదనిన్ని సయుక్తికముగా చెప్పబదియున్నది.

యిందులో సుఖదు:ఖములు కర్మాధీనము లాయెనే యీశ్వరాధనవల్ల దు:ఖములు తప్పిపొవునా, పోవా? అని శంకించుకుని కర్మమే ప్రబలమనే టందుకున్ను, యీశ్వరకృపవల్ల ఆపత్తులు నివతిన్ందు ననటందుకున్ను శాస్త్ర ప్రమాణములు వున్నందున కర్మము తల్లివంటిదనిన్ని యీశ్వరుడు తండ్రి వంటి వాడనిన్ని తల్లి, శిశువు తప్పుచేస్తే నాణ్ని శిక్షించు