పుట:Kasiyatracharitr020670mbp.pdf/445

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్రాతప్రతి - మచ్చుపుటలు

కోట్ల వరహాలు వుండును స్థావరజంగ్గమ రూవకమయిన స్తితి మూడుకోట్ల వరహాలు వుండునని తోస్తుంన్నది. దండు యాభైవేలమంది పౌజువుంన్నది. యీచంన్నపట్నం బస్తీకి మూడుపక్కలా షహరుపానా గోడ పెట్టివుంన్నది. తూర్పుపక్క సముద్రమేగాని గోడలేదు. బస్తి కోశెడుదూరం చచ్చవుకానికి వుంన్నది. బస్తీకిపోవు కోశడుదూరంలో దక్షిణపక్క యుద్దసన్నద్దమయిన కోట సముద్రవారగా కట్టివుంన్నారు. వుత్తరపక్క సముద్రంగట్టున యెగుమతి దిగుమతులు అయ్యే రేవు సరుకు వేసే కొట్లు కట్టివుంన్నది. యీ చంన్నపట్నానికంతా పాపం వీధిశాలవీధి యీ రెండు విశాలమయినది నిండ్డా కుసంద్ది అయిన వీధులు కాదు యిండ్లకు రెండువిధాల పంన్నురూకలు తీసుకుని వీధులు వూడిచి మరామత్తు చేసి ఠాణాలువుంచ్చి కుంఫిణీవారు కావిలి కాస్తూ వుంటారు. యిండ్లు తలవాకిలి తిన్నెలు పందిళ్ళు బయటికి అలంక్కారం గానుంన్ను లోపల కలకొద్దిలో ఘాలికి అడ్డం లేకుండ్డా కట్టివుంన్నారు. పరి దేవాలాయాల దాకావుంన్నది అంద్దులో విభనంగా ప్రతిసంవ్వత్సరం బ్రంహ్మో(488)త్సవాలు జరుగుతూ వుంటుంన్నది సముద్రంకుండావచ్చి పొయ్యే సరుకులకు తీరువ సుంక్కం తీశె నిమిత్తం సముద్రతీరమందు కష్టంహవుని అని వక కచ్చేరి వుంన్నది. గట్టున వచ్చెపొయ్యే సరుకులకు బస్తికి పడమట పక్క ల్యాండు కష్టం హవుసని కొన్ని కోటలోను కొన్ని బైట తోటలోను చేస్తూవుంటారు. యిక్కడికి సర్వాధికారి అయిన గవునరు యిల్లు అరికాటినావాబు యిల్లు కోటకు పడమర పావు కోశెడు దూరంలో తిరువళిక్కెణె అనే వుపగ్రామంలో వుంన్నవి. జాతలవాండ్లు అంద్దరు బస్తికి దక్షిణం ఆమడ దూరంలో వుండే పరంగి కొండవరకు మూడుకొసుల దూరంలో వుండే పరంగికొండవరకు మూడుకోసుల దూరంలో వుండే పరుంబ్బూరి వరకు సుందరమయిన తొటలు వేసి బంగ్గళాలు యిండ్లు కట్తుకుని వుంన్నారు. బస్తీలోపల వుండేవాళ్ళు హిందువుల యిండ్లలో అయ్యాపిళ్ళ యిల్లు పెద్దది కోటలోపల వుండే యిండ్లలో వాడలకు తెలిశె నిమిత్తం రాత్రిళ్ళు దీపంపెట్టె యెక్సిచెంఇల్లు పెద్దది బయట వుండే జారులవాండ్ల మెద్దెలలో మురాతు కట్టినయిల్లు పెద్దది బస్తికి