పుట:Kasiyatracharitr020670mbp.pdf/444

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నంద్దున యీ బస్తీలో మూడులక్షల ప్రజ వాసం ఛేసేటట్టు చేసి నాడు. పింమ్మట 1696 వ సంవత్సరంలో నలుభయివేల వరహాలు సాలుకు యెత్తేపాటే భూమి కుంఫిణీవారి అధీనం అయినది అటుపిమ్మట 1702 సంవత్సరంలో ఢిల్లీపాదుషా అవరంగజీబు తరఫున దావూదుఖాన్ డు దండ్డుయెత్తివచ్చి యింగ్లీసువారిని చాలా కలతపెట్టినాడు అప్పట్లో అనేక తెగలు అనేక దేశాలనుంచి యిక్కడ చేరి(426) నంద్దున యడమచెయ్యి కక్షి అని కుడిచెయ్యి కక్షి అని రెండుపక్కలుగా యిక్కడ వారు చీళి యింగిలీసువారికి చాలా శ్రమను కలుగచేసినారు అందుకు నులుభై సంవత్సరముల పింమ్మట ప్రాంసువారు యీకోట తీసుకుని యింగిలీసువారిని వెళ్ళకొట్టినా హింద్దూస్తాన్ లో యింగిలీసుజాతికి దిగ్విజయం కలిగివుండెను గనక వొకసాటిగా సమాళించినారు వెంబడిగానె అయిదు సంవత్సరములకు రాజీమీద యీ స్తళాంన్ని యింగిలీసువారు స్వాధీనం చేసుకొంన్నారు 1782 సంవత్సరంలో కలాపన పొశిగి జగధీశ్వడి కటాక్షంచాత ఫ్రాంసుదండు పరారి అయిపోయినది అదిమొదలుగా అరికాటి నవాబును విహిత పరచుకొని క్షేమంగ్గా కాలంతోస్తూ వుండగా 1762 సం.మొదలు 1721 సం.వరుకు హయిదరుతో నవాబు నిమిత్తం పోరవలసి వచ్చినది. అది మొదలు యధాక్రమంగా అరికాటి నవాబు రాజ్యమంతా యింగిలీసువారి స్వాధీనమై వుత్తరం గంజ్జాం మొదలు దక్షిణం తిన్నెవల్లిశీమ వరకుంన్నూ తూర్పున సముద్రం మొదలు పశ్చిమం సముద్రం వరకూ ఏకచక్రాధిపత్యంగా యీ చంన్నపట్నాన్ని రాజధాని చేసుకొని కుంఫిణీవారు యెలుతూవున్నారు యీ రాజధాని కింద్ద యిప్పుడు వుండే జిల్లాలు 21 యింతభూమి మధ్యేమయిసూరు, మళయాళం కొచ్చి యీ ముగ్గురు రాజులు తప్ప కొదవ అంద్దరు జమిందారిపాయా కలవారుగాని యుద్ధసన్నుద్దుడుకాగల భూపతి (427) వక్కడూ లేడు యీ చంన్నపట్నం కొడికింద్ద యిప్పుడు వసూలు సాలుకు వకటింకాలుకోటి వరహాలు అవుతున్నది ఖర్చు అప్పులకు యిచ్చేవడ్డీ సహాగా వసూలుకు యక్కువగాని తక్కువకాదు యీ చంన్నపట్నం కొడికింద్ద కుంఫిణీవారు అప్పు సుమారు రెండు