పుట:Kasiyatracharitr020670mbp.pdf/443

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్రాతప్రతి - మచ్చుపుటలు

ల్యాక వుంన్నది. కలకత్తా షహరుకు చేరిన ఉత్తరపార్శ్వం చిత్తుపూరు అనే ప్రదేశంలో గంగాతీరమంద్దు యభయి రూపాయలు నెల 1 కె బాడిగ నిష్కర్ష చేసి వక యిల్లు తీసుకుని అందులొ ప్రవేశించ్చి నాను.

వ్రాతప్రతి పుటలు 424-490: (ఈముద్రణం పుటలు 269-274)

(424) నా జన్మభూమి అయిన చంన్నపట్నం వ్రిత్తాంత్తం యటువంటిదంటే యింన్నూరుయేండ్ల కిందట చంద్రగిరిలో వీజానగరం సమస్తానాధిపతి అయిన శ్రీరంగరాయడు ధొరతనం చేస్తూ వుండగా డే అనే ధొర యీ సముద్రతీరమంద్దు వక రేవుబందరు కట్టించవలనని యత్నంచేసి శ్రీరంగరాయణ్ణి అడిగి వుత్తరువు తీసుకుని యీప్రాంత్యాలకు జమీదారుడైన దామరుల వెంక్కటాద్రినాయుడిపేర సన్నదు పుచ్చుకున్నాడు. ఆ వెంక్కటాద్రినాయుడు తన పేరుపెట్టి శ్రీరంగరాయపట్నం అని (425) రేవు బందరు కట్టమన్నా వెంక్కటాద్రినాయుడు తన తండ్రి అయిన చంన్నప్పనాయడిపేర చంన్నపట్నమని పేరుపెట్టమని చెప్పటమేగాక తానె సంన్నిధానాధిపతి గనుక అదే నామకరణం ఆరంభంలో చేసి నందున చంన్నపట్నమని పేరుకలిగినది తత్పూర్వం యీ రేవును యింగ్గిలీసువారు మదరాసు అంటూ వచ్చినారు యిప్పటికి వింధ్యన్యోత్తర దేశంలో మందరాసు అంటే యీస్తళం నిర్నయమవుతుంన్నది. గాని ఛంన్నపట్నం అంటే యవరికి అక్కడ తెలియదు పింమ్మట 1644 యింగిలీసు సంవ్వత్సరంలో రేవుబందరుకు చేరినట్టుగా వక కోటకట్టి సముద్ర తీరమంద్దు రెండు కోసుల భూమిని ఇంగిలీసు వారు స్వాధీనం చేసుకుంన్నరు. అటుపింమ్మట 1661 సంవ్వత్సరం యింగిలీసు వారిలో కొంతాఅంత:కలహంజరిగి అరాచికమయి 1671 సంవ్వత్సరంలో మళ్ళీ సుతరాయించ్చి యీరేవుబందరు సుంకం యిజారా కుంఫినీవారి చేసినారు. వెంబడిగానే కుంఫిణీవారి ప్రాపకం కోరి జగధీశ్వరుడు సత్యవాదుల పక్షపాతి గనక యింగ్గిలీషువారు చాలా సత్యఫంధులు అయి