పుట:Kasiyatracharitr020670mbp.pdf/442

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


28 ఏనుగుల వీరాస్వామయ్యగారి కాశీయాత్ర చరిత్ర

చాత నాకు కావలసినంత స్తళం వారి తోటలో యిచ్చి నేను అక్కడ వుంన్నమట్టుకు సహోదర న్యాయంగా నడిపించ్చినారు యీశ్వరుడు వారిని రక్షించ్చు గాకా.

వ్రాత పుట356. (ముద్రణం పుట 269)

(1831) ఏప్రిల్ 9 తేదీ శనివారం 12 ఘంటల్కు సార్వభౌముడి విభూతి పరంపర యెక్కువగా కలిగిన కలకత్తాపట్నం ప్రవేశించినాను యీదినముల్లో యిక్కడ నివాసం చేసే జనసమూహంయొక్క దేశ కాల ద్వారా జనించే భక్తి పురస్కతమయిన చరత్కుపూజా భాను పొడా అనే ఆరాధనలు యీశ్వర చైతన్యం యిక్కడ విస్తారం ప్రతి భాతియై* (యెట్లా హైదరాబాదులో నా ప్రవేశకాలంలో తన ఆరాధనకొరకు పీర్లపండగను సంభవింప్ప చేసినాడో యెట్లా నాగపూరిలో గోకులష్టమి ప్రయుక్తంగా పసలపండుగ ఘటింనదో యెట్లా మిరిజాపూరిలో కార్తీకమాస ప్రయుక్తంగా యీశ్వర శ్రిష్టి అయిన నక్షతాలకు ప్రతిభాతిగా ఆకాశదీపాలు పెట్టె పండగ యెట్లా ఘటించ్చినదో కాశీలో కృత్తికా స్నానాలలో పంచత్నాలు అనే దినాలు యెట్లా ఘటించినదో గయామహాక్షేత్రంలో శివరాత్రి ఉత్సవం ఘాలిపఠా పండుగ యెట్లా ఘటించ్చినదో పట్నా షహరులో హోళిపండగ అనే మహోత్సవం యెట్లా ఘటించినదో తద్వతుగా) యీకలకత్తాలోనున్ను సాంబమూర్తి ప్రీతికరమయిన పయివ్రాసిన మహోత్సవం ఘటించినది. యీ వుత్సవంలో యిక్కడి జనులు మనదేశములో శడలు ఆడినట్లు దేహాలను పొడుచుకుని నరుక్కుని తమ రక్తదర్శనాలు చేసి సంన్యాసా (పుట.357) శ్రమలాంచనలు వహించి వుదకకుంభదానాదులు పిండప్రదానాలు మొదలైన శ్రాద్ధాలు పితృప్రీతిగా కూడా జరిగిస్తూవుంన్నరు పైన వ్రాసిన స్థళంలో పయిన వుత్సవాలకు మించ్చినది సంవత్సర మధ్యే ఆయా స్థళనివాసులకు


  • బ్రాకెట్లలోని భాగం పూర్వపు ముద్రణం అచ్చుపుస్తకంలొ లేదు. అందువల్ల యీ ముద్రణంలోనూ లేదు.