పుట:Kasiyatracharitr020670mbp.pdf/441

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


27

వ్రాతప్రతి - మచ్చుపుటలు

వలశ్నిది కూరగాయలు అదెప్రకారము ప్రియమయినా మహా రుచి కరంగావుంన్నది వస్త్రాలు ఆఃభరణాలు శిపాయిలాయక్కు అయినవి యీషహరులో దొరుకును. భారీరత్నాలు కొనేపాటివుత్సాహం ధైర్యం ఎవరికీ లేనందున వర్తకులు తేవడంలేదు. ఆభరణాలు వగయిరా వుంచుకొని విక్రయించే తమ కాపు నిమిత్త్యం కొంత శిబ్బంది వుంచవలశి వుంట్టున్నది తద్వారా వక బుజురుగు వార్కి కలగడవమ వుతున్నది అందువల్ల కావలశ్ని గొప్పవారు వారి యింట్టికి వెళ్ళడం వారిని పిలిపించ్చుకుని కావలశింద్ది వారుసెప్పినధరకు పుచ్చుకుని తమకు సమ్మతి అయినప్పుడు ఖరీదుచేస్తూ వస్తారు. వర్తకసరళిగా అటువంటి గొప్ప వస్తువులుకొని అమ్మడంలేదు సాత్వీక ప్రభ్హుత్వంకల రాజ్యంలో మెదిగిన వారికి యీ షహరులో వునికింన్ని యీ రాజ్య సంచారమున్నూ భయప్రదంగా వుం(పుట.40)టుంన్నది. (చూడు. ఈముద్రణం పుట 34)

వ్రాతప్రతి పుట 355*

క్రిష్ణనగరు చేరినదిమొదలు ప్రతిదినం కొంత మబ్బువేశి నాలుగు ఘడియలు అమితమయిన ఘాలి కొట్టి పడవలను హల్ల కల్లోలంచేసి మబ్బును తీసుకొనిపోతూ వుంన్నది. యీ చానక్కు!లోముందు దినములు వెఫ్ ట్పాడ్ డాకటర్ కార్బిన్ అనేవారి తొటలో గంగ్గవడ్దున గుడారాలువేశి నివశించినాను. యీ యిద్దరు ధొరలు బహు పరోపకారులున్ను సాంప్రదాయకులుగా తోచినది. ఆ డాకటర్ కార్బిన్ అనే దొర చికిత్స నిమిత్తంగా వక గ్రంధం చేసినాడు భేదివాంతి (పుట.356)చిగిత్స నిమిత్తమున్ను అదెప్రకారం వక గ్రంధం చేసినాడు. నాడేరాలు వెయ్యడానకు పరిశుధి అయిన స్థళం నాబజారానిలిచిన తావులో దొరకక పోయుణంతల్లో సమీప నివాసులయిన పయియిద్దరు దొరలకు వారితోటలో కొంచ్చం స్తళం నిమిత్తం నఖ చీటి వ్రాసుకుంన్నంత్తల్లో సర్వాంతర్యామియొక్క ప్రేరణ


  • పాత ముద్రణం అచ్చుపుస్తకంలో ఈ పేరాగ్రాపులేదు. అందువల్ల ఈ ముద్రణలోనూ లేదు.

!ఈముద్రణంలోఅచానక్కు (బారకుపూరు) పుట268