పుట:Kasiyatracharitr020670mbp.pdf/410

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

౩౭౪

ఏనుగుల వీరాస్వామయ్యగారి

వలిస్తే ప్రతిదినము సాయంకాలమందు పరంగికొండశాల [1] లోను సముద్రము వద్ది వాడరేవుశాల*లోనున్ను నిలిస్తే వారందరు వాహన విశేషాలు యెక్కి వస్తారు గనుక చూచి ఆనందించ వచ్చును. యిట్టిదొరతనములో జగదీశ్వరుడు నావంశపరంపరగా జీవనము కలగజేసి నన్ను వుంచియున్నాడు.


కాశియాత్ర చరిత్ర సంపూర్ణమైనది.


  1. పరంగికొండ అనగా సెంట్ తామస్‌మౌంటు. 'శాల' యనగా బాటకిరు ప్రక్కల నీడకొరకు వేయు చెట్లవరుస. ఆకాలమున మౌంటురోడ్డులో కోటదగ్గర నుండి సెంట్ తామస్‌మౌంటుకు పోవు దారిలో 5 మైళ్ళ దూరమున కారన్ వాలీసు స్మారక చిహ్నము వరకు బాట విశాలమైనునుపైయుండెను. దానికి రెండుప్రక్కల మఱ్ఱిచెట్లు ఇతరవృక్షములు వరుసగానుండెను. ఇంగ్లీషు స్త్రీ పురుషులు సాయంకాల మా స్మారక చిహ్నము వరకు పల్లకీలలోను బండ్లలోను పోయి అక్కడ నేడు బీచిలోవలెనే సరససల్లాపములతో విహరించుచుండిరి. ఇట్లే వాడరేవు అనగా హార్బరు వద్దను నీడకొరకు చెట్లు వరుసగా పెంచియుండిరి. ఇదియే వాడరేవుశాల.