పుట:Kasiyatracharitr020670mbp.pdf/408

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వుంచి కుంఫిణీవారు కావలి కాస్తూవుంటారు. యిండ్లు తలవాకిలి తిన్నెలు పందిళ్ళు బయిటికి అలంకారముగానున్నూ లోపల కలకొద్దిలో ఘాలికి అడ్దులేకుండా కట్టియున్నారు. పది దేవాలయముల దాకా యున్నవి. అందులో విభవముగా ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలు జరుగుతూ వుంచున్నవి.

సముద్రముగుండా వచ్చేపొయ్యే సరుకులకు తీరువసుంకము తీశే నిమిత్తము సముద్రతీరమందు కష్టంహవుసు అని వొక కఛ్ఛేరివున్నది. గట్టున వచ్చేపొయ్యే సరుకులకు తీరువ తియ్యడానకు పడమటిపక్క లాండు కష్టంహవుసు అని వొక కచ్చేరి కట్టివున్నది. మిగిలిన కఛ్ఛేరీలు కొన్ని రేవులొనున్ను, కొన్ని కోటలోనున్ను, కొన్ని బయటతొటలలోనున్ను చేయుచూ వుంటారు. సర్వాధికారియైన గౌనరుయిల్లు అరికాటి నవాబు యిల్లున్ను కోటకు దక్షిణభాగ మందు పావుకోసు దూరములొ తిరువళిక్కేణి అనె వుపగ్రామములో వున్నవి. జాతుల వాండ్లందరు బస్తీకి దక్షిణము ఆమడ దూరములో వుండే పెరుంబూరి వరకున్ను సుందరమయిన తోటలు వేసి బంగాళాలు, యిండ్లు కట్టుకుని వున్నారు. బస్తీలోపలవుండే హిందువుల యిండ్లలో అయ్యాపిళ్ళ యిల్లు పెద్దది. కోటలోపల వుండే యిండ్లలో వాడలకు తెలిశే నిమిత్తము రాత్రిళ్ళు దీపముపెట్టే యెక్కీసుచెంజియిల్లు పెద్దది. బయిటావుండే జాతులవాండ్ల మిద్దెలలో మురాతు (J.Moorat) కట్టిన యిల్లు పెద్దది.

బస్తీకి దక్షిణము తిరువళిక్కేణి, మయిలాపూరు, తిరువటేశ్వరుని పేట మొదలయిన కొన్ని వుపగ్రామాలు వున్నవి. పడమటిపక్క చూళ పొరికపాక, కోమలేశ్వరునిగుడి యివి మొదలయిన కొన్ని గ్రామాదు లున్నవి. వుత్తరభాగమందు చాకలపేట, రాయపురము, తండయారువేదు మొదలయిన్ కొన్ని గ్రామాలు వున్నవి. యీ బస్తీలో వుండే హిందువులు అందరు వుత్తరభాగమందు తిరువట్టూరి వరకు ఆరామక్షేత్రాలు భేటాగా యేర్పరచుకొని విలాసకాలముల యందు అక్కడికి వెళ్ళి విహరిస్తూ వుంటారు. కోమలేశ్వరున గుడివద్ద వొక చిన్నయేరు ప్రవహింపుచున్నది. దక్షిణపక్క మయిలాపూరు