పుట:Kasiyatracharitr020670mbp.pdf/401

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సమీపముగా వున్నది. యిక్కడ ఈ రాత్రి మసుసటి దినము మధ్యాహ్నమువరకు నిలిచినాను.

లోకములో యీశ్వరుడు వొక రూపముతో ఆదరింపుచు మాతాపిత్రాదులు అనేక రసాలను కాలోచితముగా తెచ్దుకొని వొక్కొక్క రసముతో వొక్కక్క విధమయిన అభినయాన్ని పట్టి శిసువులను రక్షించేటట్టు సమస్తవిధాలా యెదటనిలిచి యీశ్వరుడు మాట్లాడుచు వుండగా యీశ్వరుడు ప్రత్యక్షముకావలె నని లోకులు యీశ్వర సాన్నిధ్యము కావలెననిన్ని పిచ్చి తపస్సులు చేయుచున్నారు. యిందుకు కారణము జగదీశ్వరుని దురత్యయ మయిన మాయకాని వేరేకాదు.

2 తేది మధ్యాహ్నము మీదట 4 గంటలకు బయిలువెళ్ళి యిక్కడికి ఆమడ దూరములో వుండే తిరువట్టూరు అనే మహాస్థలము అస్తమానానకు చేరినాను. *[1] దారి వుప్పురేగడిభూమి. చెరిసగము దూరములో సుంకపుమెట్టు వొకటి వున్నది. సుంకము వసూలు నిమిత్తము యిక్కడ మూటలు ముల్లెలు చెన్నపట్టణమునకు నాలుగు పక్కలా వుండే మెట్లలో సోదా యిచ్చేటట్టుయిక్కడ యివ్వవలశినది. నేటి దారిలోమధ్యే కాకిర్రేవు కాలువ దాటవలశినది. వారధి మీదపోతే కొంతచుట్టు గనుక పడవలగుండా ఆ కాలువ దాటినాను. వర్షాకాలము గనుక దారి అడుసుగా వున్నది. యీతిరువట్టూరు బహు సుందరమైన వూరు. ప్రతిసంవత్సరము యిక్కడ జరిగే బ్రహ్మోత్సవము వసంతకాలములో శుక్లపక్షములో అపర రాత్రిళ్ళలో విభాము జరుగుటచేత చెన్నపట్టణములో సమస్త విధములయిన జీవనోపాయాలు కలవారు నిద్రాకాలాన్ని మానుషానందాను భవానకు వుపయోగము చేసుకుని చెన్నపట్టణము మొదలు తిరువట్టూరివరకి 2 కోసులదూరములో అడుగుకు వొక సత్రముకట్టి దానికి తగ్గ వుపచారములు వారువారు ఆ సత్రాలలో

  1. * 'కోమలేశ్వరుడి గుడి మునియపిళ్ళ కొమారుడు శ్రీనివాసపిళ్ళ వారున్ను వచ్చి కలుసుకొని తమ సంకల్పం సిద్దించెగదా అని ఆనంద పడ్డాడు ' అని వ్రాత ప్రతి 481 పుటలో వున్నది.