పుట:Kasiyatracharitr020670mbp.pdf/386

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మనుష్యులు నిండా ఆరోగదృఢగాత్రులుగా వుండలేదు. స్త్రీలు లలంకారపురస్సారముగా శోభాయమాన లయి వున్నారు. స్వరూపలావణ్యము గలవారు కారు. చెవులకు నిడుపుగొలుసులు వేశి కొన్ని పాపటకు చేర్చి చెక్కుతారు. స్త్రీ పుర్లుషులు చాయ వేసిన వస్త్రప్రియులై యున్నారు. రాజమహేంద్రవరానికి యీవల కృష్ణవరకు బ్రాహ్మణ్యమునకు భూజీవనాలు విస్తారములేక సంతుమాత్రము అతిశయిస్తూ రావడముచేత బందరుబస్తీ యాచక బ్రాహ్మణపూరితమై వున్నది. గంజాం, విశాఖపట్టణం, రాజమహేంద్రవరం, మచిలీబందరు, గుంటూరు జుములా యీఅల్యిదు జిల్లాలలోను భూమి విస్తారము జమీందారుల అధీనముగా పూర్వము నుంచి చేయబడివున్నందున జమీందారుల ప్రాబల్యద్వారా హిందువులవల్ల అద్యాపి కొన్ని విశేషధర్మాలు 20-30 వేల బ్రాహ్మణులకు సంతర్పణములున్ను చేయబడుచున్నవి. అన్నిటిలోను బందరు కాకినాడ జిల్లాల జమీందారులు చాలా ధర్మబుద్ధిగలవారు. రాజా కొచ్చర్లకోట వెంకటరాయనింగారు రెండావృత్తులు కుటుంబసహితముగా తులాభారము తూగి రెండావృత్తులు లక్ష బ్రాహ్మణభోజనము చేయించి అనేకయాగాలు చేయించినారు. వాశిరెడ్డి వెంకటాద్రినాయుడు అప్పారావు మొదలైన మరికొందరు అంతకు యెక్కువగా హిందుధర్మములను జరిగించినారు. యీ దేశస్థులు కచ్చేరి సహితముగా విందుచేస్తే ఆ వుత్సవాన్ని మేజువానీ లంటారు. కాకినాడజిల్లా సాలుకు 2 లక్షల వరహాలు యెత్తుచున్నది. మచిలీబందరు ఆరు లక్షల వరహా లెత్తుచున్నది. యీ మచిలీబందరులో ఆగస్ఠు నెల 15 తేదివరకు వసించినాను.

16 తేది వుదయాత్పూర్వము నాలుగుగంటలకు బైలువెళ్ళి యిక్కడికి 2 ఆమడ దూరములో నుండే కొత్తపాళె మనే కృష్ణాతీరపు వూరు 10 గంటలకు చేరినాను. దారిలో యీదేశస్థులు పర్రలు అని చెప్పే పల్లెలు కొన్ని వున్నవి. రేగడభూమి. కొత్తపాళెమునకు రెండు కోసుల దూరములో చల్లపల్లియనే యేర్లగడ్డ జమీందారుని నివాసగ్రామము వొకటి వున్నది. అందులో సుందరతరముగా వొక