పుట:Kasiyatracharitr020670mbp.pdf/381

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వతుగా యీ ప్రపంచము కృతజ్ఞత సాత్వికత్వౌలతో నిండితే అన్ని ప్రకృతులు చప్పుడు లేక స్థావరములుగా నిద్రపోతూ వుండవలశినవి గనుకనున్ను దురత్యయమయిన మాయ 'కష్నతి కష్నతి కష్న త్యేన ' అనే వచనప్రకారము పండితులను కూడా మోసపరచి చీకటిలో కండ్లు కలవాడు కండ్లు లేనివాడున్ను సమ మయినట్టు మనుష్యులను కృతఘ్నులను చేయుచున్నది గనుక అదేప్ర్కారము అప్పట్లో గౌతముల ఆశ్రమములో నున్న బ్రాహ్మణులు కుతంత్రమువల్ల ల్వొక గోవును కల్పించి గౌరములు ఆ దినము చల్లిన పయిరు మే శేటట్టు చేసినారు. ఆ గోవు ఆ ప్రకారము తాను చల్లిన పయిరు మేశేకృత్యము చూచి గౌతములు బ్రాహ్మలమీది భక్తిచేత గరికపోచను గొవుమీద వేశి అదలించినాడు. అంతమాత్రానికే ఆ గోవు చచ్చినట్టు అభినయించినది. వెంబడిగానే అక్కడవున్న బ్రాహ్మలు గౌరములను హత్యదోషము కలవాణ్నిగా నిందించినారు. గౌతములు పశ్చాత్తప్తలయి నాకు యేమి గతి యని బ్రాహ్మణమందలిని అడగగా శివుని జటాజూటములో వుండే విష్ణుపాదప్రసూతయయిన గంగను బయిటికి తెచ్చి అందులో అవగాహనము చేస్తేనేగాని నీవు పుణ్యాత్ముడవు గావని చెప్పినారు. పిమ్మట గౌతములు తపస్సువల్ల సాంబమూర్తిని సంతోష పెట్టి వొక ధారను భూమిమీదికి తెచ్చి తన ఆశ్రమముదాకాతెచ్చి స్నానముచేసి యెప్పుడున్ను లోకాపకారముగా భూమిమీద ప్రవహింపుచు వుండేటట్టు చేసినాడు. ఆ ధారకు, గొదావరి అని నామకరణము చేయడమయినది. పిమ్మట సప్తఋషులు గౌతములను ప్రార్ధించి సెలవు పుచ్చుకుని యేడుధారలుగా గోదావరిని చీలదీసి తమ తమ ఆశ్రమాలకు తీసుకుని వెళ్ళీనారు గనుక యీ రాజమహేంద్రవరమునకు గోదావరి అఖండముగా వచ్చిధవళేశ్వరము మొదలుగా చీలి సప్తగోదావరులుగా అయినది. ఆ సప్తగోదావరీ తీరమందు వుండే భూములు గోదావరీ వుదకబలముచేత సమసస్యా ధులను అమోఘముగా ఫలింపచేయుచున్నవి. ఆ సప్తగోదావరీ తీరమును కోనశీమ అనుచున్నారు. అక్కడ బ్రాహ్మలకు భూవసతులు చాలా వున్నవి.

యిది కాకినాడుజిల్లా యెనిమిదిలక్షల వరహాలు సాలుకు యెత్తు