పుట:Kasiyatracharitr020670mbp.pdf/380

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గొప్పవర్షము కురిశినది. అప్పట్లో స్నాననిమిత్తమున్ను శివాలయదర్శననిమిత్తమున్ను వచ్చిన స్త్రీలు వర్షమును లక్ష్యపెట్టక స్నానపానములు స్వామిదర్శనాలు తడుస్తూచేసిన వేడుక చూడముచ్చటనున్ను విజయనగరములోను పట్నాఅనే షహరులోను గొప్పవారి యిండ్ల స్త్రీలకు అత్యంత దేహోపద్రవాలు కలిగి నేను ఔధముయిచ్చి పధ్యము తీసుకొమ్మన్నంతలో చచ్చినా మంచిదిగాని స్నానము లేక మేము వంటచేసుఖోక అన్నము పుచ్చుకొనమని వొకపట్టుగా మూర్ఖముచేసిన నిశ్చయముచూడగానున్ను 'కలిసాధుస్త్రీయస్సధు ' యనే సామాన్యవచనము బాగానేవున్నట్టు తోచుచున్నది.

యిక్కడనుంచి రెండుగంటలకు బయిలువెళ్ళి యిక్కడికి 4 కోసుల దూరములోనుండే రాజమహేంద్రవరము 3 గంటలకు చేరినాము. దారి కిరుపక్కలా అడివికలిగి యిసుకపరగావున్నది. రాజానగర రాజమహేంద్రవరాలకు చేరిసగాన పోలీసుఠాణాను పాంధుల క్షేమముకై కలకటరు వుంచివున్నాడు. యీ రాజమహేంద్రవరము పూర్వము రాజరాజనరేంద్రుని రాజధాని. అతని కొడుకు సారంగధరునితో చంద్రవంశము అంత్యమయిన దని లోకప్రసిద్ధి.

యీ రాజమహేంద్రవరము గౌతమమహాముని ఆశ్రమము పూర్వకాలమందు ద్వాదశర్షక్షామము సంభవించి సమస్త బ్ర్రాహ్మణ్యము అన్నములేక మనుష్యకోటికి గురువులయిన గౌతమలవద్దికి వచ్చి మొరపెట్టుకుంటే వారు తన తపోబలముచేత బ్రత్యహము కొద్దిగా వరిబీజాలు చల్లి అవి సద్య:ఫలమునకు వచ్చేటట్టుచేసి ఆధాన్యము అక్షయ మౌటచేత అనేకకోటి బ్రాహ్మణ్యమునకు ప్రత్యహము అన్నము యిచ్చి వారల ప్రాణరక్షణ చేసినారు. పిమ్మట క్షామము వదలగానే సమస్త ద్విజులు గౌతముల ఆశ్రమము వదిలి పొయ్యేటప్పుడు యంత యశస్సు గౌతములకు రావచ్చునా అని అసూయచేత, పాంఛంభౌతిక దేహములన్ని యీశ్వరుని మాయా సంబంధమయిన అరిషడ్వర్గముతో బద్ధము లయివున్నవి గనుకనున్ను ఉయిక్కడి జిల్లాజడ్జియయిన వైబరుటుదొర, చెక్కుముక్కి రాయిపై యినుము వేగముగాకొట్టి అగ్ని పడకపోతే తుపాకీలోని మందుగుండు బయిలుపడదు అన్న