పుట:Kasiyatracharitr020670mbp.pdf/379

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మిక్కిలి తీక్ష్ణమయిన వేసంగికాలములయందున్ను, అనావృష్టి దోషాలు కలిగినప్పుడున్ను వొక్కరీతిని మిట్టను ప్రవహింపుచున్నది. పిఠాపురము పెద్దాపురము జమానుదారులు తాలుకాలవారు వంతుల ప్రకారము యేటి నీళ్ళు అడ్డకట్టి తమ గ్రామాదులకు తెచ్చుకోవడము చేత వీరి తాలూకాలలో యెల్లప్పుడు పంటలు సమృద్ధిగా గలిగియున్నవి.

పెద్దపురమనే వూరు పిఠాపురముకన్నా గొప్పది. యీ వూరి యిండ్లున్ను గొప్పలుగానే కట్టియున్నారు. 100 బ్రాహ్మణుల యిండ్లు కలవు. యిక్కడ పోలీసుదారోగా సహితముగా యిక్కడి జమీందారుడు వసింపుచు నుంటాడు. యితని తాలూకా 3 లక్షలది. అంగళ్ళు కలవు. సమస్తపదార్ధాలు దొరుకు చున్నవి. యీ వూళ్ళో 3 సంవత్సరములుగా యీ జమీందారుని భార్య అమ్మన్న అనే పురుషుని గొప్పయిల్లు స్వాధీనము చేసుకుని వొక అన్నసత్రము వేసియున్నది. ఆ స్థలము విశాలముగా వున్నందున అందులోనే యీ రాత్రి వసించినాను.

21 తేదీ వుదయాత్పూర్వము 2.4 గంతలకు లేచి యిక్కదికి 2 ఆమడ దూరములోనుండే రాజానగర మనే వూరు 10 గంటలకు ప్రవెశించినాను. దారి ఇసక కలిసిన రేగడ. కొంచపాటి యడివిన్ని, వొక కొండ తిరుగుడున్ను బహు చోరభయమున్ను కలిగి నడవ సమకూలమై వున్నది. యిక్కడ గోపాలరాజుల పితూరి అనే పేరుగల బందిపోట్లు ప్రతివూర కలిగివున్నది. నేను తుని యనే వూరివద్ద వదిలిన అయళ దారి రాజానగరము ముందు వచ్చి కలిసింది. రాజానగరము జలవసతి కల వూరు. అంగళ్ళు కలవు. పోలీసు అమీనా వసిస్తూ వుంటాడు. అన్ని పదార్ధములు దొరుకును. యీ వూరు కొచ్చలకాకోట వెంకటరాయుడి జమీను. యిక్కడ లోగడ రాజాబహదరు వారి అన్నసత్రము వుండి నిలిచిపోయినంతలో యీ జమీందారుడు. ఆ సత్రాన్ని వుద్ధరించి మళ్ళీ జరిగింపుచున్నాడు. యీ సత్రములో వంటబోజనముల నిమిత్తముదిగినాను. సత్రము బహువిశాలముగా కట్టివున్నది. యీవూరికి సమీపమందే 40 యిండ్ల బ్రాహ్మణాగ్రహారము వొకటి వున్నది.

పాదగయలో నేను తీర్ధము వొడ్డున డేరాలలో దిగివుండగా