పుట:Kasiyatracharitr020670mbp.pdf/372

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

౩౩౪

ఏనుగుల వీరాస్వామయ్యగారి

కనంకోట యనే వూరు గొప్పదేను. అన్నిపదార్ధాలు దొరికేపాటి అంగళ్ళు కలవు. బ్రాహ్మణ యిండ్లలో వంట, భోజనము కాచేసుకుని వొక గంటకు బయిలుదేరి యిక్కడికి యేడుకోసులదూరములో నుండే యలమంచిలి యనే వూరు ౭ గంటలకు చేరినాను.

నేటి మధ్యాహ్నము దారిలో వ్యాఘ్రభయాలుకూడా కద్దు. యిది మజిలీవూరు అయినప్పటికిన్ని దారి వొత్తి వొకకోసుదూరములో వుండే దివ్యల అనే గ్రామ నివాసి యయిన భాగవతుల కిత్తన్న యెదురుగా వచ్చి తన వూరికి రమ్మని ప్రార్థించినందున ఆ వూరు ౭ గంటలకు ప్రవేశించి ఆరాత్రి ఆ మరునాడు శుక్రవారము వర్ష ప్రతిబంధముచెత నిలిచినాను. యీ వూరు ౧౦౦ యిండ్ల అగ్రహారము. అందరు ఉపపన్నులు అయినప్పటికిన్ని వొక యతిశాపముచేత పెంకుటిండ్లు కట్టక పూరియిండ్లల్లో కాపురము చేయుచున్నారు. యీ వూళ్లో వుండే బ్రాహ్మణులందరు వేదపారంగతులు. కిత్తయ్య యనే వారు జమీౝదారుడున్ను, మంచి సాంప్రదాయికుడున్ను. యీ వూళ్ళో అంగళ్లు కలవు. అన్ని పదార్ధాలు దొరుకును.

౧౬ తేది వుదయాత్పూర్వము ౪ గంటలకు లేచి యిక్కడికి ౫ కోసుల దూరములో నుండే నక్కపల్లి వుపమాకా యనే వూళ్లు ౯ గంతలకు చేరినాను. దారి కొంత వెల్లడిగా వున్నది. కొంతదూరము యిసకపరగానున్ను, కొంతదూరము రేగడగానున్ను వున్నది. వుపమాకా యనే వూళ్ళో వొక చిన్నకొండమీద వెంకటాచలపతి గుడి వున్నది. ౫౦ యిండ్ల వైష్ణవాగ్రహారము ఆ గుడిని నమ్ముకుని వున్నది.వెంకటాచలపతిపేరు ప్రసిద్ధి.యీవూరు మొదలుగా దక్షిణదేశములో కలిగివున్న దని తెలియవలసినది. ఆకు తినే మేకల మందలు పొలాలలో విశాఖపట్టణముతోచేరిన విజయనగరపు రాజ్యము సరిహద్దు మొదలుగా చూస్తూవస్తాను. జగన్నాధము మొదలుగా యేదలనే యెనుములు పోతులు విస్తారము కలవు.

విశాఖపట్టణము జిల్లా సాలుకు ౧౪ లక్షల రూపాయిలు యెత్తుచున్నది. భూమి యావత్తు జమీౝదారుల అధీనముగాని కలకటరు అమానీ విచారణలో యేమాత్రమున్ను లేదు. జమీౝదారులకు యీ