పుట:Kasiyatracharitr020670mbp.pdf/370

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నప్పుడు తమలో రాము పోట్లాడితే పోట్లాటలు ఖామందుల మనసున నిండా నొప్పిచేస్తున్నది.

నేడు వుదయాన నడిచినదోవ కుంఫిణీలయను దారి కిరుపక్కలా చెట్లుమాత్రము పెట్టి యండాకాలములో వాటికి నీళ్ళు పోయడానకు మనుష్యులను వుంచుతారు. వర్షాకాలము రాగానే ఆ మనుష్యులను తీసివేయడమువల్ల పెట్టినచెట్లు అదృశ్యమయి మళ్ళీయివతలి సంవత్సరానకు కొత్తచెట్టు పేట్టవలసి వున్నవి.

యీ రాజ్యములో వీరభద్రరాజు యనేవాడు తనకు కావలశినంతా నారాయణ బాబుగారి కార్యస్థులు యివ్వలేదని కొళ్ళగాండ్లను కొలువు పెట్టించి మనుష్యులను హింస చేయుచున్నాడు గనుక నేను బురంపురములో కొలువు పెట్టిన ఆరుగురు బంట్రౌతులు శ్రీకాకొళమునుంచి కోటునజీరు తయినాతి పంపించిన ముగ్గురు జవాన్లు గాక నారాయణబాబుగారి ఫౌజు సంబంధ మయిన పదిమంది శిఫాయిలను కూడా తెచ్చినాను. ఆలమందలో విజయనగరమురాజు నారాయణబాబుగారి షడ్డకుడు వాసము చేస్తాడు. 10 బ్ర్రాహ్మణయిండ్లున్నవి. సమస్తమైన పదార్థాలు అంగళ్ళు కలవు గనుక దొరుకుచున్నవి. యిక్కడ వర్ష ప్రతిబంధముఛేత యీ వూళ్ళో యీరాత్రి వసించినాను.

13 తేది వుదయాత్పూర్వము 3 గంటలకు లేచి యిక్కడికి 6 కోసుల దూరములో వుండే సబ్బవర మనే వూరు 2 గంటలకు చేరినాను. దారి బహు దొంగల భయము. కొండలు, అడివి దారి కిరుపక్కలా వున్నవి. కొంతదూరము రాతిగొట్టు తతిమ్మాదారి కొంతదూరము యిసకపొర, కొంతదూరము రేగడాభూమిగా నున్నది. ఆలమంద అనే వూరికి సమీపమందు అరణ్యము మధ్యే కొండమీద పర్మనాభమనే స్థలము వున్నది. పురాతన ప్రతిష్టగాని అనాదిపురాణ సిద్ధముకాదు. అక్కడ మానుషసంచారము విస్తారములేదు. సబ్బవరమనే వూళ్ళో వెన్నకోటివారు వొక గ్రామము విజయరామరాజువద్ద సంపాదించి వొకపాలు అగ్రహారానకు వృత్తులు చేసి మరివొక పాలు అన్నసత్రానకు వొదిగేటట్టు నిశ్చయము చెసి వొక అన్న సత్రము కట్టి మరివొకపాలు తమ వంశస్థుల అనుభవానకు వుంచి