పుట:Kasiyatracharitr020670mbp.pdf/369

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దాయము యీరాజ్య్హములో 2 లక్షల దాకా వుండేటట్టు విన్నాను. యిక్కడానున్ను బందిపోటు వుపద్రవము చెన్నపట్టాణములో వారంటు తియ్యడాలు జడిజీకోటుకు యీడ్చడాలవలెనే వొకరి మీద వొకరికి కోపమువస్తే నిమిషములో జరిగింపుచున్నారు. ఆదివారము రాత్రి నేను దిగిన వూళ్ళో వొక బిందువు పడకపోయినా విజయనగరములో అమితమయిన వర్షము కురిసినది.

ఇరువది మూడవ ప్రకరణము

12 తేది వుదయాత్పూర్వము 3 గంటలకు లేచి యిక్కడికి 6 కోసుల దూరములో వుండే ఆలమంద యనే వూరు 2 గంటలకు చేరినాము. యీ విజయనగరము దేశపు బోయీలు బాగా నడుస్తారు. చెన్నపట్టణములో పల్లకీసవారీలయొక్క షోకు బహుశా అందరికి కలిగి వున్నందున గంజాము మొదలుగా వుండే బోయీలందరు చెన్నపట్టణము వచ్చుచున్నారు. చెన్నపట్టణములోనుంచి నాతోకూడా యాత్రవచ్చిన యాత్రబోయీలలో కొందరు యిండ్లు బురంపురము వద్ద వున్నందున వారు శలవుతీసుకొని వెళ్ళినారు.

నేను కన్యాకుమారి మొదలుగా కాశ్మీరమువరకు సంచరించిన ప్రదేశములలో వుప్పాడ బోయీలకు సమానమైన మోతగాండ్లు, చూపరులు, బలాఢ్యులు, అలంకారప్రియులు, ప్రయాసకు వోర్చగల వారు, బంట్రౌతుమానాగా ఆయుధధారణప్రియులు యెక్కడా వున్నట్టు తోచలేదు. అయితే దేశముకాని కొన్నిదేశాలకు వస్తే యీ వుప్పాడ బోయీలకు దేహదార్ఢ్యము తప్పి రోగిష్టులొవుతారు. వారిని జాగ్రత్తగా కాపాడుచూ వారి దేహములు వొచ్చిన కాలమందు ఆయా దేశస్థులయిన బోయీలతో పనిగడిపి వీరిని తీసుకొనివస్తే యీ వుప్పాడ బోయీలతో భూగోళ సంచారము యావత్తూ చేయవచ్చునని తోచుచుచున్నది. పాలకీలు మోశే వృత్తికి యీ వుప్పాడదేశస్థులనే ఈశ్వరుడు తగినవారినిగానే నియమించినట్టు తోచబడుచున్నది. అయితే వీరు మాంస, మద్య, మత్స్యప్రియులు మిక్కిలి అయినంచున వీరు తాగి