పుట:Kasiyatracharitr020670mbp.pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యిక్కడ విజయనగరపు రాజు గురువు వశిస్తాడు. యీ రాజుయొక్క పూర్వీకులు వైష్ణవ మతస్థులయి దక్షిణదేశ సంచారము లోగడ చేసినందున శానామంది వైష్ణవులను ఈ దేశానకు పిలుపించి ఈ రామతీర్ధాలలో ప్రవేశపెట్టి వారికి పుష్కలమైన భూజీవనాలు యిచ్చినారు గనుక వారు సంతోషముగా యీ రాజ్య్హములో వశింపుచున్నారు. ఈ విజయనగరము యిప్పటి రాజుల పూర్వీకుల కింద 240 సంవత్సరములు గా వున్నట్టు తెలిసినది. ఈదేశము దేవబ్రాహ్మణ సమాగమద్వారా 100 సంవత్సరములుగా నిండార్లుగా కర్మభూమి అయినట్టు తోచినది. యీ బస్తీలో రాజు వశించే చిన్న కోట వొకటి వున్నది. కోటవలిగా యెయ్యిండ్లు కలవు. సమస్తమయిన పనివాండ్లు వున్నారు. బంగారుమీద పోగరపని చేసేవాండ్లు ఘట్టివాండ్లుగా శానామంది వున్నారు. సుందరమైన పాత్రసామానులు చేయగల కంచర వాండ్లున్ను, మంచి బట్ట నేసే నేతగాండ్లున్ను వున్నారు.

యిక్కడి రాజు రాజ్యము విశాఖపట్టణపు కలకటరు అధీనముచేసి కాశీ వాసము సహాకుటుంబముగా చేసుట ఛేత యీ రాజ్యనివాసులు తల్లిని కానని బిడ్డలవలెనే తల్లడింపుచున్నారు. యీ మొర ఆలకించగా హిందువులకు వర్ణాశ్రమధర్మముల ప్రకారము సమస్త తారతమ్యములు తెలిశిచేసే దొరతనమే మిక్కిలీ అనుకూలముగ తోచబడుచున్నది. యిక్కడి రాజు అయిన నారాయణబాబు ధనసంగ్రహ మయిన జాగ్రత విశేషముగా పెట్టక అప్పులపాలైనా ప్రజలవల్ల స్తుతి చేయబడుచున్నాడు.

యీ వూళ్ళొ బోయీలు బండ్లు మార్చుకునే నిమిత్తము సోమవారమంతా గొపాలస్వామి మఠములో నిలిచినాను. యీవూరి యిండ్లు యథోచితముగా బాగానే కట్టియున్నవి. రాజవీధులు మాత్రము విశాలముగానే కట్టియున్నవి. యీ సోమవారము జగన్నాధములో రధోత్సవము గనుక యెవూళ్ళోనున్ను ఒక జగన్నాధస్వామి గుడి వుండగా అక్కడ రథోత్సవము బహువిభవముగా జరిగినది. యీ రాజ్యము 9 లక్షల రూపాయల దని పేరు. 2 లక్షల యెత్తుతున్నది. సాలుకు 4 లక్షలు కుంఫిణీవారికి కట్టవలశినది. దేవాదాయము బ్రహ్మా