పుట:Kasiyatracharitr020670mbp.pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాత్రముగా వుండినది. భోజనాత్పరము నడిచినదారి యేనుగపొడుగు యిసక దిబ్బలమధ్యే వొకపక్క సమద్రము, కుడిచేతిపక్క అంది పుచ్చుకున్నట్టు మింధ్యపర్వతము వుంచూ వచ్చినది. యిక్కడ వింధ్యపర్వరము సముద్రములో కలిసినట్టు తోచుచున్నది. యిక్కడ యెప్పుడున్ను దొంగలు కొట్టి దోచడము వాడికె యని తెలిసినది. నిలవనీడ, తాగ నీళ్లున్ను దొరకవు. ప్రయాగకు గంజానికి చెరిసగములొ వొకబావి. వొక చిన్న శివాలయమున్నున్నది. ఆగుడిచుట్టూ యీశ్వరాజ్ఞ చేత వొక మర్రిచెట్టు ఆవరించినట్టు అల్లుకుని యేనూటికి చాలేపాటి చల్లని నీడ గలిగివున్నది.

గంజాం షహరు 15 యేండ్లకిందట మల్లాడి యనే జ్వరముచేత హతమైనది గనుక నున్ను మిగిలినవారు బురంపురమునకు వలసవెళ్ళి అద్యాపి అక్కడి నివాసులై యున్నారు గనుక షహరు పాడుపడ్డట్టుగా కనుబడుచున్నది. యిక్కడ వాడలు మరామత్తు చెయ్యడానకు గంగాతీరమందు కలకత్తాలోనుంచి వుడిబడియాకు నావలమీద వచ్చే దారిలో బాందలు అమితముగా చేసి పగిలిన వాడలు వుంచివుండేటట్టు యిక్కడ సముద్రతీరమందు గదులు చేసి వాడలు వుంచివున్నది. అనేక గొప్పయిండ్లు ఖాలిగా వున్నవి గనుక అందులో వొక యింట్లో దిగినాను. యిక్కడ వొక రేవుదొర, వొక కొత్తవాలు న్ను న్నారు. మొసాఫరులకు కావలసిన పదార్ధాలు ఆని దొరుకుచున్నది.

యీ గంజాం పట్టణము ఋషికుల్య అనే నదితీరము. వింధ్యగిరి యిక్కడనే సముద్రగామి యయినందుననున్ను, యీ గంజాము వింధ్యకు దక్షిణదేశ మనిపించుకోబడి యిక్కడివారు యీ ఋషి కుల్యనది మొదలుగా చాంద్రమాన రీత్యా అయ్యే ప్రభవాది సంవత్సరములను సంకల్పములో చెప్పుతారు. ప్రయాగ యనే వూరివరకు బృహస్పతి మానము, గంజాం మొదలుగా చాంద్రమానము. గంజాం మొదలుగా యీశ్వర నిర్ణయ ప్రకారము కళింగదేశము ఆరంభమవుటఛేత యిండ్లు మనుష్యుల అలంకారాలు దృష్టిదోషపు పాటింపులు దక్షిణదేశము వలెనే యావత్తు కలిగివున్నవి. చిన్నయిండ్లకు కూడా వాకిట పంచవన్నెలు పెట్టేకట్టినారు. ప్రతిస్త్రీలు బులాకులు ముక్కర