పుట:Kasiyatracharitr020670mbp.pdf/354

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నిన్ని సందేహవిషయముగా వుండడమున్ను వుచ్చిష్టనిషేధములు లేక ప్రసాదస్వీకారము చేయడమున్ను ప్రసాదముమీద అత్యంతగౌరవమున్ను జాతినియమ వర్జితమున్ను యివిమొదలయినవి కలిగియున్నవి. వీటిని యావత్తున్ను వొక సమూహముచేసి వాటివాటి కారణాలున్ను ఆ కారణాలలో పరంపరగా జన్యమయ్యె కారణాలున్ను యివంతవిచారించగా నా బుద్ధికి తొచడము యేమంటే సమస్తమయిన కర్మభూమియందున్ను సగుణోపాసనకు అనుకూలముగా అనేక దేవతల ఆరాధనలు నియమించి వారివారి భార్యలతోకూడా బింబాలను చేసి వాటికి మందిరములు కట్టి ఆరాధింపుచూ వుండగా నిష్కాముడయి మహాత్ముడయి నామరూప రహితుడయి జ్ఞాన స్వరూపుడయిన దేవునియొక్క రీతిని లోకులకు కృష్ణలీలలను భాగవతసేవ అనే ఆటమూలకముగా ప్రసిద్ధపరచినట్లు యీ జగన్నాధమందిరాన్ని కట్టి యిందులోని మూర్తులను యీరీతిగా రూప నిర్ణయములేక కల్పించి స్థాపించి వొక తత్వ సంగ్రహ పురాణద్వారా ఉచ్చిష్టదోషరహితముగా ప్రసాదగ్రహణము జాతిభేద నివృత్తి యీ స్థలములో కలుగజేసి ప్రకాశింపచేసినట్టు తోచుచున్నది. దని క్రమ మేమంటే శుద్ధతత్వము సమస్తశౄతి చోదితముగా నాదము బిందువు కళ అతీతము అని చెప్పబడుచున్న నాలుగు వస్తువులు ఒకటిగా అయితే అవాజ్మానసగొచర వస్తువు ప్రకాశిస్తున్నది. నాదస్వరూపమయిన జీవాత్మ, బిందు స్వరూపమయిన ఆత్మ కళా స్వరూపమయిన అంతరత్మ, అతీత స్వరూపమయిన పరమాత్మ వీటియొక్క రూపములు యిట్టివని నిర్ణయించ కూడనిది సత్యము గనుక నిర్ణయించకూడని రీతిగానే జీవాత్మ అని చూపించేకొరకు యిప్పట్లో బలభద్రుడనే బింబాన్ని చేసి ఆత్మ నిరూపణ కొరకు సుభద్ర బింబాన్ని చేసి అంతరాత్మయొక్క నిరూపణకొరకు జగన్నాధస్వామిబింబాన్ని చేసి పరమాత్మ నిరూపణకొరకు శుద్ధస్తంభాకారముగా వుండే సుదర్శన బింబాన్ని కల్పించి యీ నాలుగింటిని బోధితము లయ్యేటట్టు చేయడము అవాజ్మానన గోచరవస్తువుయెక్క అన్నమయినందున ఆ అన్నాన్ని ప్రసాదముగా యిక్కడ పేరుపెట్టి సమస్తానకు ఆధారభూతము అన్నము