పుట:Kasiyatracharitr020670mbp.pdf/350

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

డమేకాని వేరే యెటువంటి భూరూపకమయిన ఆకరములేక వున్నా లక్షాధిరారులుగా కొందరు పండాలు వున్నారు.

మూడుమూర్తులున్ను దేవదారు దారువులతో నడుముట్టుకు తీరితీరని అంగములతో చేసివున్నవి. బలభద్రుడు జగన్నాధస్వామియనే మూర్తులకు రెంటికిన్ని మణికట్టులేని హస్తాలు ఆలింగనము చేసుకోను జూచిన వతుగా యేర్పరచి యున్నది. మధ్యేవుండే సుభద్రా బింబము చిరతవాలుగా చేతులు లేకనే యేర్పరచబడి యున్నది. జగన్నాధస్వామికి కుడి పక్క సుదర్శనమనే పేరుపెట్టి వొక ముసలాకారముగా ఆదారువుతోనే వొక రూపము యేర్పరచి వుంచినారు. 12 సంవత్సరములకు వొకసారి వచ్చే అధిక ఆషాఢమాసములో కొత్తదారువులను తెచ్చి మూర్తులు యిక్కడ పరంపర్యముగా చేసే శిల్పులచేత చేయించి పూర్వికపు కిరాతకుల వంశస్థులలో ముక్తిని ఆపేక్షించి ఏకవారాశము చేసి బ్రహ్మచర్యము చెయుచునుండే వృద్ధులచేత పాతమూర్తుల వక్షస్థలములో వుండే చైతన్యాన్ని కొత్తమూర్తులలో వుంపించి ఆవక్షస్థలానకు బీగము ముద్రలు వెయిస్తారు. సుభద్ర మూర్తిలోని చైతన్యము పరరాష్ట్రస్థులకు చిక్కి వోఢ్రదేశమందే వేరేచోట పూజింప బడుచున్నది. నాకు తెలియడములో బలభద్ర మూర్తిలోను జగన్నాధస్వామి మూర్తిలోను అద్భుతమయిన వొక లోహమిశ్ర మయిన హస్తప్రమాణము గల వొక స్థూలాకృతి పరమాత్మకున్ను వొకవిగ్ర(హ)ము జీవాత్మకున్ను ప్రత్యామ్నాయముగా వుండేటట్టు విన్నాను. సుభద్రా దేవిబింబములో వొకలక్ష్మీనారాయణ మూర్తి సాలగ్రామము మాత్రము వుండేటట్టు పీఠము మీద మెత్తతలగడలు వేశి వుంచి వస్త్రాలంకారము చేసివుంచుతారు. గనుక కాళ్ళుకలిగినట్తుగానే దర్శనమూవుతూవుంచున్నది. జగన్నాధ బింబమునకు నీలవర్ణము పూశి యున్నారు. బలభద్రబింబమునకు శ్వేతవర్ణముమున్ను సుభద్రకు పసుపువర్ణమున్ను పూసి వర్ణముతో కండ్లుముక్కు యేర్పరచి