పుట:Kasiyatracharitr020670mbp.pdf/342

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కౄరుణ్నిగానున్ను వుండేతావులోనుంచి కదలని వాణ్నిస్థావరిరూపుణ్నిగా నిందించి మనసును రంజితపరచి ఆతిధ్యం యిచ్చేవాడు శ్రేష్టుడని ప్రత్యుత్తరవు యిచ్చినాడట. హిందుమతస్థుడు మంచిపదార్ధములున్ను మంచిస్థలమున్ను దొరికినవాడు తనకు అబ్బెగదా అనిన్ని కొత్తవాణ్నిపిలుచుకొని వస్తే తనకు దొరికిన మంచి పదార్ధము భక్షణచేసెవాడికె కొత్తవానికి లేక పదార్ధాన్ని చెరిచి తాను భుజించక ఆ మంచి పదార్ధాన్ని నిందించి పదార్ధము కలవానికి పనికి రాకుండా కొత్తవాడు యెక్కడ చేసిపోనో అనే భయముచేత మంచిపదార్ధము కలవాడు వొకణ్ని చేర్చక వొకని తొను చేరక తనంతట వుండును. వాడు పూర్ణుడున్ను బలవంతముచేసి తన పదార్ధము పెట్టేవాడున్ను బోధించి తన పదార్ధమును పెట్టేవాడున్ను సకాములు వుత్తమ పదార్ధమును కన్నవారు కారు అని పరస్పరమున్ను నిందించివారట.

యిదిన్నిగాక మరివొక ఇతిహాసము విన్నాను. అది యేమంటే వొక యింగిలీషుదొర వొక బ్రాహణ్ని నాదేహమువలెనే నీదేహము రక్తమాంసాది యుక్తములయిన అవయవాదులతో చేసివున్నదే? బ్రాహ్మలు మేము యెక్కువ అని అనుకోవడానకు కారణ మేమని అడిగినంతలో బ్రాహ్మణుడు పుల్లమామిడిపండు తియ్యమామిడి పండున్ను వొక్కదినుసు ఆకులు కొమ్మలుగల చెట్టున వొక ఋతువులో వొకటే విధమయిన తోలు కండముట్టేతో జనించి సమస్త విధాలా వొక్కటేరీతిగా వున్నా రుచిభేదము కావడానకు యేమికారణమో అదేకారణము బ్రాహ్మణుల యెక్కువతనాన కని చెప్పి మరిన్ని బ్రాహ్మలు శ్రేష్టులని యీశ్వరుడు చెప్పినాడంటాము గాని మేమే చెప్పలేదు. యెట్లా అన్ని మామిడిపండ్ల వుత్పత్తి స్థితిలయాలు వొక్కటే క్రమమయినా వాటి భోక్తకు వాటి రుచిభేదము తెలిశి యిది మంచి యిదిచెడు అని వాట్లను వాడినట్లు మీదేహసారానిన్ని బ్రాహ్మణదేహాల సారానిన్ని యెరిగి యీశ్వరుడు తియ్యమామిడిపండు శ్రేష్టమని రుచిచూడగలవాడు చెప్పినట్లు బ్రాహ్మలను శ్రేష్టులని నిరూపించినాడని చెప్పినాడట.