పుట:Kasiyatracharitr020670mbp.pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూటశోధన నిర్బంధము లోకులకు కలిగి యున్నది.

1 వ తేది వుదయాత్పూర్వము 1 1/2 గంటలకు లేచి యిక్కడికి 9 కోసుల దూరములో వుండే సూరంగు అనే వూరు 7 గంటలకు చేరినాను. నామూడు సవారీలలో రెండు సవారీలకు యిరువై యింటికి వోఢ్రబోయీలను పెట్టవలసి వచ్చినందునన్ను వారు యిరువురి మోతతో వారి వారి అడుగులను యివతలవారి అడుగులతో కలుపుకోకుండా మెల్లిగా నడిచేవారు గనుకనున్ను యెండగొట్టుకు యెంతమాత్రము సహించలేదు గనుకనున్ను రాత్రిళ్ళు యింతప్రొద్ధువుండగా లేచి నడవ వలసివున్నది. దారి నిన్నటివలెనే సడక్కుచేసి యున్నది. యిసక కలిసిన రేగడ. బాలేశ్వరము మొదలుగా కుడిపక్క రెండు గడియల దూరములో సముద్రములో కలియవచ్చిన వింధ్యపర్వత సంబంధమైన పర్వతములు వుండి వున్నవి. నేటిదారిలో బాలేశ్వరానకు కొశెడు దూరములో వక సుంకపు పెరిమెట్టు చౌకీ వున్నది. యిక్కడి కలకటరు మేజెస్ట్రేటు అయిన రికెట్టుదొర వొక చప్పరాశి బంట్రౌతును తయినాతిగా యిచ్చినందున తలషీ అనే శోధన చిక్కులేకుండా సాగి వచ్చినాను. అయినప్పటికి నా గొప్ప కాపాడుకునే నిమిత్తము చౌకీ 1 కి ర్పు 2 వంతున యినాము యిస్తూవచ్చినాను. ఠాణా సరిహద్ధు ప్రకారము వొక బరక్రదాసు అనే పోలీసు బంట్రౌతు వస్తూ వచ్చినాడు గనుక యివతలి సరిహద్ధు పోచాయించి (చేర్చి) బంట్రౌతు సాగి పొయ్యేటప్పుడు అరదూపాయిలు యినాము యిస్తూవచ్చినాను.

యీ భూమిని వరిపయిరు యెక్కువ. యీ వుత్కలదేశములో వసించే వొఢ్రబ్రాంహ్మణ పండితులు గౌడదేశస్థులకన్నా సంస్కృత భాషను బాగా వుచ్చరించుతారు యీ దేశస్థులకు తెనుగుమాట వొకటి అర వచ్చును. చెన్నపట్టణమంటే తెలియదు. మదిరాసు అనవలసినది.

కలకత్తావద్ద భాగీరధీంది వదిలిన వెనక గంగలో కొట్టుకునివచ్చే కళేబరాలను తినే నిమిత్తము యీశ్వరుడు గంగకు యిరుపక్కలా సృజన చేసిన వింత ఆకృతిగల బోరుగద్ధలను చూడలేదు. ఆగద్దలు రెండు