పుట:Kasiyatracharitr020670mbp.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రీస్తుమతానికి అంతర్భూతమయిన అరమనజాతి మొదలయిన వారిగుళ్ళు బహుశ: యీ బస్తీలో కట్టివున్నవి. క్రీస్తుమత ప్రకటన నిమిత్తము యిక్కడ అనేక ప్రయత్నములు గ్రంధప్రచురత్వద్వారా జరుగుచున్నవి.

ముచ్చిగోలా మొదలు బ్రారకుపూరుదాకా వొక సడక్కువేసి యిరుపక్కలా చెట్లువేసి బహుసుందరముగా యేర్పరచి వున్నది. సహరు బస్తీ నిడువున వుత్తర దక్షిణములు మూడామడవుండవచ్చును. వెడల్పులో రెండామడ వుండవచ్చునని తోచుచున్నది. జనబాహుళ్ళము చూస్తే సుమారు 15000 వేలు వుండవచ్చునని తోచినది.

మవాసైనీలయిన స్త్రీలు శంఖపుగాజులు ధరించవలసినది అగత్యము గనుక దక్షిణదేశపు శంఖాలంతా ఈ దేశములోనే వ్రయమయ్యేటట్టు తోచబడుచున్నది. స్త్రీలు విస్తారము ఆభరణాదులు ధరించడము లేదు. పురుషులలో గొప్పగా వుండేవారు యింగిలీషు జాడగా వస్త్ర వాహనాదులు వాడుకుంటున్నారు. వాద్యవిశేషములలో ఫిడీలు అనే యింగిలీషు వీణలు యీప్రాంతముల బహు ప్రచురముగా వున్నవి. యిక్కడల స్తర్లు గ్లాసులు కరిగిపోశి చేయుచున్నారు. కంట్లాలు మోశే గుర్రాలు వొంటెలు దొరకవు గనుక నా డేరాలను బోయీల చేత మోయించేటట్టు నిశ్చయము చేసినాను.

దేశ దేశపు వాడలు యిక్కడ వరకు తెచ్చి యిక్కడి సరకులు దేశ దేశాలకు తీసుకొనిపోవుటచేత యీ షహరులో దొరకని ద్వీపాంతర పదార్ధములుగాని స్వదేశ పదార్ధములు గాని లేకవున్నవి. వర్తకులు సుఖించివున్నారు. యిటువంటి కలకత్తాషహరులో జూన్ నెల 2 తేది వరకు వసించినాను.

ఇరువదియవ ప్రకరణము

3 తేది వుదయాన 5 గంటలకు ప్రయాణమై పడవలమీద వుడుబడియా యనే వూరికి 12 గంటలకు చేరినాము. ఈ దేశములో ఆయుధపాణులుగా యెవరున్ను వుండకూడకపోయినా బనారసుల్లో