పుట:Kasiyatracharitr020670mbp.pdf/322

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కము చేసుకునేటట్టు వునికి పట్టుకు కొంత భూమి యిచ్చి యెగుమతి దిగుమతి సరుకులమీద నూటికి యింత అని తీరువ సుంకము మొకరరు (నిర్ణయము) చేస్తే మా యింగిలీషు జాత్రివారికి క్షేమము కలగుచున్నది; యింతకు మిక్కిలి బహుమానము నాకు యేమి అక్కరలేదని మనివి చెసుకున్నంతలో పట్నా షహరు ప్రభువు ఆ డాక్టరుయొక్క సామర్ద్యానికిన్ని నిస్పృహతకున్ను సంతోషించి అప్పుడే పరవానా డాక్టరు కోరిన ప్రకారము వ్రాసి యిచ్చినాడు. తదనంతరము, కాళీ గుడివద్ద కొన్ని గుడిశెలు వుండగా ఆ స్థలములలో ప్రవేశించిన తర్వాత హుగ్గులియనే సమీపపు వూళ్ళో గిడ్డంగీలు యిండ్లు మొదలైనవి కట్టుకొని యింగిలీషు వారు వర్తకము చేయుచూ వచ్చినారు. తర్వాత మక్కుషూదాబాదు (మూర్షిదాబాదు) లోని అధికారస్థునికి ఢిల్లీ పాదుషాకుండా మొక్త్యారు అధికారము కలిగి యీ దేశము అతని అధీనమై ఆ అధికారస్థుడు, యీదేశములో పూర్వపు కాపురస్థులైన ప్రాంచువారి బోధనవల్ల యింగ్లీషు వారిని యెక్కువ తీరువ యివ్వమని నిర్భందపెట్టి పట్నా అధికారస్థుడు వ్రాయించి యిచ్చిన ఫరవానా పాదుషాదికాదు అనే షరా మీద యిక్కడా యింగిలీషు వారికి వుండరాములు చెసినంతలో యింగిలీషు వారు ఒక డాక్టరు సమేతముగా డిల్లి పాధుషాతో మొరపెట్ట్లుకునేటందుకు వెళ్లినారు. అప్పట్లో యీశ్వర ఘటనచేత ఢిల్లీ పాదుషాకు దేహము స్వస్థములేక యత్నము చేసిన వివాహము కూడా నిల్చివుండేటట్టు ప్రసక్తి అయి యింగిలీషు డాక్టరు వచ్చివుండే వైనము తెలిసి పిలువనంపించినాడు. యీశ్వరుడు ఆ డాక్టరుమూలమగా పాదుషాకు దేహముకుదిర్చి యింగిలీషువారి అభీష్టమును పాదుషా పరమానా మూలకముగా సిద్ధి చేసినాడు. ఆ ఫరమానా ప్రకారము కొంచెము దినములు నడిపించి మళ్ళీ మక్కుషాబాదు అధికారస్థుడు తిరగబడినందున యింగిలీషువారి నిభాయించ లేక కొందరు తమవారు వుండే చెన్నపట్టణముచేరి శీమరాజుకు అర్జీ యిచ్చుకున్నంతలో శీమరాజు తమ జాతివారి క్షేమముకొరకు కొన్ని యుద్ధపు వాడాలను ఫౌజుబందితో కూడా కలకత్తకు పంపించి చెన్నపట్టణపు గౌవరుమెంటువారిని కుమ్మక్కు చెయ్యమని వుత్తర్వు చెసినందుననున్ను యిరుపక్కలా భూమి ధనురాకార