పుట:Kasiyatracharitr020670mbp.pdf/321

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ప్రసుద్ధ పరచినాడు. యీ కులీనుల కూటస్థులు యీ దేశములో ప్రవర్తించిన వెనుక కొన్ని జాతినియమాలు ఆచారనియమాలు కలగచేసినారు. అందులో కొన్ని సువర్ణపు పనులు సువర్ణవ్యాపారాలు చేసేవారు బనియాలనే జారిని స్వర్ణస్తేయము సురాపానము మొదలైన పంచమహాపాతకాలు శాస్త్రచోదితములై వుండుట చేతనున్ను, యీ సునారుబనియాజాతి యేవిధముగా స్వర్ణ స్తేయము చేయకనే విధిలేని వారుగనుకనున్ను ఆ జాతిని అతినికృష్టముచేసి పెట్టినారు. తదారభ్య అదేరీతిని నికృష్టులయి వున్నారుగాని దక్షిణదేశపు కంసాలజాతివలెనే బ్ర్రాఃమలకు సమము కావలెననే ప్రయత్నము కలవారయి యేమాత్రము వుండలేదు.

యీ బంగాళీ దేశములో వంశావళీ పరంపర ఆయా తెగది ప్రత్యేకముగా వ్రాశివుంచగలందులకు తెగకు కొన్ని కుటుంబాలను ఘటికులని యేర్పరచి వుంచి వున్నారు. వివాహాలు తటస్థ మయి నప్పుడు ఆకవిలెలు వ్రాసేవారిని పిలువనంపించి యోచించి ఆ ఘటికులు సమ్మతించిన వెనక ఫలానివాడికి ఫలాని చిన్నదాన్ని యివ్వవలసినది నిశ్చయము ఛేయబడుచున్నది. యీ సంప్రదాయము దక్షిణదేశములో నందవరీకుల కులాచారాలకు సరిపడుతున్నది.

యీ దేశములో వివాహాములు విషయమందున్ను అపరవిషయముల యందున్ను ధనికులకు విశేష వ్రయముచేసే సంప్రదాయము కలిగి యున్నది. పూర్వాపరాలు చేయించడములో మంత్రబాహుళ్యము లేకపోయినా తంత్ర బాహుళ్యము చాలాగా కలిగి మళయాళదేశము వలెనే శుభాలు ప్రసక్తి అయినప్పుడు స్త్రీలు కొళాలి అనే ధనిచేసే వతుగా కంకారానము చేస్తారు. అనుగమనాలు స్త్రీలు చేయడము యీ దేశములో యీ వరకు బహు విస్తారముగా జరుగుతూ వచ్చినది. అని భక్త విషయములో కూడా యీ దేశమందు స్త్రీలకు భాగము కద్ధు. రఘునందనుడనే వొక పురుషుడు చేసిన పునస్మృతిని యీ దేశములో నిండాగా వాడుకుంటారు. తంత్రజ్ఞులని పేరుపెట్టుకొని శాక్తమతస్థులు కొందరు ప్రబలి వున్నారు.

నద్యా శాంతిపురము మొదలుగా వుండే యిండ్లు పూరియిండ్లు,