పుట:Kasiyatracharitr020670mbp.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీద ముసుకుకూడా వేసుకుంటారు గనుకనున్ను రవికెలు తొడిగే సంప్రదాయము లేదు గనుకనున్ను అవయవాలు పూరాగా కప్పబడి వుండడములేదు;. పుల్రుషుల దీనత్వమున్ను, స్త్రీల ఆచ్చాదనమున్ను మళయాళానకు సరిపోలివుండినా స్త్రీల సౌందర్యముమాత్రము వ్యతిరిక్తముగా లోపముపడివున్నది. బంగాళీభాష హిందూస్థాని అభాసముగా బడా అండాకు బోడా అనే వతుగావున్నది. బంగాళీ అక్షరాలు దేవనాగరానకు కొంచెము భేదము కలిగివున్నవి. పురుషులు కృశాంగులు గనుక ప్రయాసకు యెండకు వోర్చలేరు. శైత్యోపచారాలు తైలలేపనము ప్రత్యహముచేసి శీకాయ మొదలయిన నూనె పొయ్యే పదార్ధాలతో తోమి కడగక నేస్నానముచేసి వొళ్ళు తుడుచుకుంటూవస్తారు. శీకాయ యిప్పపిండి మొదలయిన పదార్ధాలు యీ దేశమందు దొరకవు.

యీ దేశాన్ని గౌళదేశమనిన్ని, విరాట దేశమనిన్ని చెప్పుతారు. యీ దేశమందు శిష్టులయిన బ్రాహ్మలుకూడా సహజముగా మత్స్యభక్షణ చేయడముమాత్రమే కాకుండా యిచ్చటి వారు సకల బ్రాహ్మణులున్ను ఆరీతినే చేస్తూ వుందురనే సిద్ధతాత్పర్యులై నావంటి విహితులు తటస్థమైనప్పుడు లేతమత్స్యకలేబరాలను యితర భక్ష్యయోగ్య పదార్ధాలతో కూడా పంపిస్తూ వస్తారు. యిక్కడ పండితులకు ద్వైత సిద్ధాంతము కలిగి గౌతమ వైరచితమయిన న్యాయ శాస్త్రములో చాలా పరిశ్రమకలిగి వున్నది. యీ దేశస్థులకు స్నాననియమము దేశాచారములు చాలా కలిగివున్నవి. స్యయ్ంపాక నియమమున్నూ కలిగివున్నది. వుప్పునీళ్ళు కలియని పక్వాన్నాలు వ్యవస్థ లేక పుచ్చుకొని భక్షిస్తున్నారు.

300 సంవత్సరముల కిందట యీ దేశపురాజు వొక యాగము యత్నముచేసి నిర్వహించను సమర్ధులు యీ దేశపు బ్రాహ్మలలో లేనందున గంగా యములమధ్య ప్రదేశ నివాసులయిన కాన్యకుబ్జులను అయిదు గోత్రాలవారిని యీదేశమునకు పిలువనంపించి ఆ యాగము సాంగముగా కాచేసుకొని ఆ అయిదు తెగలవారిని యీ దేశములో నిలుపుకో వలెననే తాత్పర్యముతో వారిని కులీనులని