పుట:Kasiyatracharitr020670mbp.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యీగుళ్ళలొ నున్ను వారివారి యిండ్లలొ పెట్టి పూజచేసే బింబాల ముందరనున్ను బలులు యిస్తారు. యీ కలకత్తాలోనున్ను చుట్టుపక్కలనుండే బంగాళీ దేశాస్థులకు యిక్కడ విలశిల్లివుండే కాళి ప్రత్యక్షదేవతై వారిభక్ర్తిని మిక్కిలిగా ఆకర్షిస్తూ వున్నది. యీ గుళ్ళో వుండే కాళిప్రతిమ బహుస్థూలముగా వున్నది. బహుమంది గుళ్ళలో పునశ్చరణ చేయుచుంటారు. గుడిచుట్టూ పూజాదిద్రవ్యాలు అమ్మే అంగళ్ళు శానావున్నవి. జపాకుసుమాలు సంపెంగలు వగయిరా పుష్పాలు మనిషి చెయ్యెత్తు పొడుగున మాలలు కట్టి అపరిమితముగా సదా అమ్ముతూ వుంటారు. ముప్ఫయి రూపాయిలలో వస్త్రసమేతముగా షోడశోపచార పూజ అవుతున్నది. భిక్షుకులు బ్రాహ్మణులుగా నున్ను కంగాళీలుగా నున్ను ప్రతిదినము వెయ్యింటికి తక్కువ లేక గుడిచుట్టూ వుంటారు. యీ దేశమందు గవ్వలు మరడముచేత పిడికిడేశి గవ్వలు యిచ్చినా యిరువై రూపాయలు దక్షిణకు పట్టుచున్నవి. పూజ చేసే లోకులు మిఠాయి మొదలైన పక్వపు పదార్ధములు పండ్లు పచ్చిబియ్యమున్ను నైవేద్యము పెట్టుతారు. గుడి పూజారులు నిత్యము పక్వాన్నము మొదలయినవి నైవేద్యముచేసి, తాము తిని బ్రాహ్మల కిస్తారు. దేవీప్రతిమను సువర్ణముతో దావుడు నాలికెను చేసి యెనిమిది భుజములు కల్పించి లలాటమందు సిందూరము వుంచి భీకరాకారముగా అలంకరించి వుంటారు. ముఖమంటపముకన్నా గర్భగృహము, రొమ్ముల లోతు పల్లములో వుంచున్నది. నవరాత్రిళ్ళలో ఈ బంగాళీదేశస్థులు భీకరాకృతిగా మృత్తుతొ దేవి ప్రతిమలుచేసి వాటికి వర్ణరేఖలు మొదలయినవి పూయించి వుత్సవానంతరము విభవముకొద్ది వూరేగింపుచేసి గంగలో కలుపుతారు. ఆ వుత్సవాలకు మద్యపానాలు వేశ్యలపొందున్ను బహుశా జరిగి చూడ వింతగా వుంచున్నది. ఆ విభవము మతాంతరస్థులకు యీ మతస్థులను నింద చేయడానకు ప్రబలమైన ఆకరముగా వున్నది.

యిది కన్యాకుమారీ క్షేత్రమంటారు. యిక్కడ పురుషులు స్ఫురత్తులేక దీనత పొందివుంటారు. స్త్రీలున్నూ నిండా సౌందర్యవతులుకారు. 12 మూరల బట్టతో దేహాచ్చాద్నమంతా చేసి తల