పుట:Kasiyatracharitr020670mbp.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గడపవలోసినది గనుకనున్ను గంగాభనానిలోనుంచి హదరుగంజు అనే వూరివద్ద చీలి దక్షిణముగా ప్రవహింపుచూ కలకత్తాకు పొయ్యే జలంగి అనే పేరుగలిగిన గంగధారలో ప్రవేశించి కలకత్తాకు సాగి వచ్చినాను. యీ జలంగినది గంగాప్రవాహము తక్కువైన దినము లలో బహు హ్రస్వమై కొన్ని మిట్టతావులలో వొక మూర, వొకటిన్నరమూర లోతు వుంచున్నది. అట్టి తావులలో వస్తూవుండే వరకు నిండిన పడవలు నాగక దినాలవెంబడి సమూహములుగా నిలిచి, వచ్చేపొయ్యే పడవలకు దారికూడా లేకుండా నిబిడీకృతముగా వుంచున్నవి. అట్లా తక్కువ నీళ్ళు గల ప్రదేశములకు గట్టానా అని యీ నావవాండ్లు పేరు పెట్టినారు. అట్టి తావులలో వొక నిమిషమైనా ఆలస్యపడకుండా నాతోకూడావుండే మనిషికట్టుద్వారా సమీప గ్రామవాసుల సహాయద్వారానున్ను అక్కడా నిలిచివుండే నావ మల్లాలద్వారా నాబజరా వుల్లాకులతో యివతలికి సాగివచ్చినారు.

మార్చ్ది నెల 23 తేది పటకాబాడి యనే గొప్పవూరు చేరినాను. యీ వూరుచెరేలోపల గట్టానాలు శానా తగిలినవి. యిది మొదలు జలంగినది పల్లపు ప్రదేశములో ప్రవహిస్తూ వచ్చినది గనుక నీళ్ళుకావలసినంత నదిలో వుంటూవున్నవి. యీ జలంగినది సర్పాకారముగా బహుచుట్టు చుట్టి ప్రవహింపుచున్నది. గనుక వుత్తరమునుంచి దక్షిణము పోవడములో మళ్ళీ మళ్ళీ వుత్తరమే చేరి, భోజనము చేసి వూరికి గట్టున రెండు గడియల దూరములో వుండేవూరు సాయంత్రము చేరుతు వచ్చినాము.

గంగాభవాని ప్రవాహము పుష్కలముగా వుండేకాలములో బదరుగంజుకు పడమరగా వుండే మౌర్హగంజు భగవ్రాగోలా అనే వూళ్ళవద్దనుంచి వొక ధారమక్కుషూరాబాదు (మూర్షిదాబాదు) కాసంబాజారు (కాసీంబజారు) బురంపూరు అనే మహర్లమీద వచ్చి యిప్పుడు నేను వచ్చే ధారలొ కృష్ణనగరు అనే వూరివద్ద కలియుచున్నది గనుక ఆ ధార కలకత్తా వెళ్ళడానకు నిండా సూటి యని ఆదారిని అన్నినావాలు వెళ్ళుతున్నవి. యిప్పట్లో ఆ ధారలో వుదకములేదు గనుక యీజలంగినదిగుండా అన్ని వానాలు వస్తూ