పుట:Kasiyatracharitr020670mbp.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వల్లనున్ను యీ బ్రంహ్మాండమునకు చలనశక్తి కద్దనడానకు సందేహములేదు. గోళము తిరుగుతూవుంటే గోళముమీద నుండేవారికి నిలిచిన స్థలము కదిలికె అయితే తెలియదా అనిన్ని, గోళము తిరిగితే జంరువులు తలక్రిందుగా నడవా అనిన్ని కొందరు సందేహిస్తారు; ఆ సందేహము యెంతమాత్రము నిమిత్త్ములేదు; యెందువల్లనంటే పెద్దవాడలలో వుండేవారికే వాడనడవడము తెలియక వుండగా యింతబృహతైన గోళముమీద వుండేవారికి గోలచలనముయేట్లా తెలుసును గనుక? సూదంటు రాయిని పొడుగుగాయెత్తి కింద సూదిని వుంచితే భూమిని ఆధారముగా చేసుకొనివున్న సూది రాయిలోవుండే ఆకర్షణ మహిమచేత పైకిలేచి రాయిని అంటి వెలాడుచూ వుంచున్నదిగాని భూమిమీద పడదు గనుక, యీ గోళమునకువుండే ఆకర్షణ మహిమ చేత గోళము మీదనుండే సృష్టికోటి తలక్రిందుగా పడవలసిన నిమిత్తము యెంతమాత్రమున్ను లేదు.

పందొమ్మిదవ ప్రకరణము

మార్చినెల 22 తేది బదరుగంజు అనే వూరు చేరినాను. యిదిన్ని పది అంగళ్ళుగల బస్తీవూరు. యీ బదరుగంజు నుంచి గంగాభవాని తూర్పుగా సముద్రగామి కావడానకు సాగిపోవుచున్నది. ఆపెద్దప్రవాహము గుండా కలకత్తాకు సాగిపోతే సముద్రములో ప్రవేశించి కొంతదూరము సముద్రములొ పడమరగా వచ్చి మళ్ళీ హుగ్గుళి అనే నది ముఖద్వారములో చొచ్చి దక్షిణముగా తర్లి కలకత్తాకు చేరవలచినది గనుకనున్ను అటు పోవడానకు యిలాగంటే బజరాలు మొదలయిన వావాలు నడిపేవారికి జీళ్ళ పొలుకువ తెలియదు గనుకనున్ను అటుపొవడము యిరివై దినములు చుట్టుగనుక నున్ను అటివెళ్ళే గంగాభవానిధార సుందరవనమనే అఘోరమైన యడివి మధ్యే పోతున్నది. గనుకనున్ను ఆ అడివిలో నుండే వ్యాఘ్రాదులు మదలైన దుష్టమృగములు మనుష్యులను బాధపెడుతూ వుండుటచేత గట్టున దిగడానకు సయిపు లేక వావాలమీదనే భోజన మజ్జనాదులు