పుట:Kasiyatracharitr020670mbp.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేశానకు భేదించడమునకు కారణ మేమని విచారించగా యీబ్రంహ్మాడము యొక్క మధ్యభాగమైన నిరక్షదేశములో రాత్రి పగలున్ను సరిగా ముప్పదేసి గడియల వంతున దిన ప్రయాణ మవుచున్నది. గనుక సూర్యోద యాస్తమయములు సమముగా అవుతూ వుంచున్నవి. అందుకు కారణము అక్కడి వారికి సూర్యబింబ దర్శానము వుదయకాల మందున్ను, అస్తమయ కాలమునందున్ను చక్కని అభిముఖము కావడముచేత అది మొదలుగా వుత్తరపు దిక్కు వుదయాస్తమయకాలములలో సూర్య్దర్శనము యధోచితమయిన పార్శ్వభాగముగా క్రంక్రమముగా అవుతూ వుండుటచేత బ్రంహాండము యొక్క వున్నత ప్రదేశములలో వసించే వారికి సూర్యదర్శనము అయ్యే ప్రమాణకాలము భూమియొక్క చక్రాకార చలనముచేత క్రమక్రమముగా తక్కువవుతూ వచ్చుచున్నది. యీబ్రంహ్కాండమునకు చలనశాక్తి కలిగి వుండడానికిన్ని, యీ బ్రంహాండము సూర్యబింబానికి ప్రదక్షిణము చేయుచూ వుండడానికిన్ని యీ అహ:ప్రమాణభేదము వొక్కటే దృష్టాంతముగా వున్నది. యిదిన్ని గాక యింగిలీషు దేశపు సముద్రసంచారులలో వొకడు యీ పరెక్షనిమిత్తము వొక ప్రదేశములోనుంచు కావలసిన రస్తు కొన్ని సంవత్సరములకు వాడలో వుంచుకొని తూర్పుగా పోతూవుండేటట్టు వాడని సాగిస్తూ వచ్చినాడు. తూర్పుదిక్కు ఫలాని దనే జ్ఞానము సూర్యోదయమువల్లనే పుట్టుచున్నది గనుక ప్వత్యహము సూర్యోదయమును పట్టి తూర్పు తెలిసి పోతూవుండే కొద్ది సుమారు కొన్ని సంవత్సరములలో బయిలువెళ్ళిన స్థలమే చేరినాడు. అట్లా యెందువల్ల బయలు వెళ్ళిన స్థలమే ఆ పురుషుడు చేరినాడంటే బ్రంహ్మాండములో నొకపక్క వసించే వారికి తూర్పుదిక్కు బ్రంహ్మండముయొక్క చలనద్వారా వారి వృష్ణభాగమునందు వసించే వారికి ఆ తూర్పుదిక్కు పడమటి దిక్కౌతున్నది గనుక తూర్పూని తోచేప్రదేశమునుంచి బయలుదేరి అక్కడికి పడమర వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి తూర్పు దిక్కుగానుండే ప్రదేశమునకు తరులుతూ వస్తే బయిలు వెళ్ళిన తావు చేరడము వింతకాదు గదా! యీ దృష్టాంతము