పుట:Kasiyatracharitr020670mbp.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

త్తులకు కారణ మేమనిన్ని విచారించగా సాత్వికగుణము ఆభాసమయితే రాజసగుణముగా పరిణమింపుచున్నది గనుక నున్ను రాజసము ఆభాసమయితే తామసముగా పరిణమించడము దృష్టాంతము గనుకనున్ను, సత్వగుణ ప్రధాను డయిన పరమాత్మ ఆత్మలో భాతిఅయి ఆభాతే అంతరాత్మ అయినది గనుక పరమాత్మవల్ల అంతరాత్మ జనించినట్టు సాత్వికమువల్ల అంతరాత్మ స్వభావమయిన రజోగుణము దేహములో వుత్పత్తి అయినది. అంతరాత్మజననద్వారా ఆత్మకు చైతన్యప్రభావము కలిగినది. గనుక ఆచైతన్యము అంతరాత్మయొక్క ఆభావమైనందున రాజసగుణాభావముగా వుండే ఆత్మస్వభామైన తామస గుణము దేహములో జనించినది. ప్రకృతి దేహములలో పరమాత్మ - అంతరత్మ -ఆత్మ యీ ముగ్గురి వ్యాపకము సిద్ధముగా నుండుటచేత వారి ముగ్గురిస్వభావాలైన సత్వర్జస్తమోగుణాలున్ను వ్యాపించి యున్నవి. తమోగుణ జన్య మైనవి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు; వీట్లను సాధారణముగా అరిషడ్వర్గము లనుచున్నారు. రజోగుణజన్యములు అహంకార మమకారాలు. సత్వగుణజనములు శాంతి దాంతిక్షములు, ఆత్మకు అంతరాత్మద్వారా చైతన్యముకలిగినదనే తెలివి ఈశ్వర్కటాక్షము చొప్పున కలిగేవరకు దేహియొక్క దేహములో తమోగుణప్రవృత్తి కలిగి ఆత్మ అరిషడ్వర్గాలచేత బహు బాధపడుతూ వుంచున్నది. అటుతర్వాత పరంపరగా అంతరాత్మకున్ను, నాస్థితికి కారణము పరమాత్మేగదా. నేను యే పాటివాడను? జలబుద్బుద వత్తనే తెలివి కలిగేవరకు రజోగుణానకు ప్రవృత్తి కలిగి నాకు సమానులు వొకరుకద్దా నేను శాసాపనులు చేసినారు, యింకా చెయగలుగుదును; అంటూ అహంకార మమకారాలచేత అంత రాత్మ వ్యధపడుతూ వుంచున్నది. పైన వ్రాసిన తెలివి అంతరాత్మకు కలిగి అంతరాత్మ ప్రకోపము అణిగిపోగానే పరమాత్మ యొక్క దీప్తిస్ఫరత్తుగా ప్రకాశించి సత్వ గుణ ప్రధానమై తజ్జ్స్యమైన శాంతి దాంతి క్షమాదులు ప్రవృత్తిని పొంది వుంచున్నదవి.

సపుంసక లింగము వుల్లింగము స్త్రీ లింగ మనే లింగ త్రయము