పుట:Kasiyatracharitr020670mbp.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చూస్తే తామసగుణ ప్రధానులకు ద్వేషబుద్ధి జనించడము సహజము గనుక, తామసగుణ ప్రధాను లయిన రాక్షసులు మొదలైన వారికిన్ని సాత్విక గుణప్రధానులైన దేవతలకున్ను యుద్ధములు పురాణోకతముగా వుండేలాగు అప్పుడప్పుడు సంభవిపుచు వచ్చినట్టు తోచుచున్నది. వశిష్టాదులుగా వుండే మునులు జన్మంకుచేత మనుషదేహులైనా వారు చేసిన సుకర్మములచేత దేవదేహులై దేవ సమానులైనారు. గనుక సాత్వికగుణ ప్రధానమైన దేవలోక సంచారములు వారికి గలిగి వుండేటట్టు తోచబడుచున్నది. విరజానది సన్నిహితమైన విష్ణు నివాస వైకుంఠమున్ను, సాంబమూర్తి నివాసమైన కైలాస పర్వతమున్ను మొదలైన వుత్తమ ప్రదేశములు మనకు వూర్ధ్వమున నుడే ఆరు భువనములలోనే వున్నవి. యీ కర్మ భూమిని వసించే మానుష మండలిలో కొందరు తామసారాధన ప్రియులై తామస గుణ ప్రధానులైన భూత ప్రేత పిశాచ రాక్షస్ గణాలను వుపాసన చేయుచూ వచ్చినారు గనుకిఅ వారి ప్రదేశమున్ను యీ మానుష నివాస భూమియందు గలిగి వారున్ను అతి తామసారాధనలచేత సర్వేశ్వరుని కటాక్షము సంపాదించినవారై సాత్వికగుణప్రధానులైన దేవతలను ధిక్కరించేపాటి సామర్ధ్యము కలవారైనారు గనుక వారు అటు తర్వాత తమ్మున ఆరాధించినవారియందు అనుగ్రహము చేయుచు తమంత వారినిగా చెయుచూ వచ్చినట్టు తోచుచున్నది.

లవణేక్షు సురాదులనే యేడు సముద్రములు ప్రత్యేక ప్రత్యేక ముగా నున్నవా లేక వొక సముద్రములోనే ఆ యేడు సముగ్రాలున్ను అంతర్భూతములా అని విచారించగా మన పురాణాదుల రీతిగానున్ను మతారంతరస్థుల పురాణాదుల రీతిగానున్ను సృష్టియొక్క ఆదిలో లోకారాధ్యుడు జలార్ణవముగా వున్న బ్రహ్మాండములో జలమును తొలగతోసి మృత్తికను కలుగచేసినట్టు వున్నది గనుక అటుతర్వాత పిండాండములయొక్క వాసార్ధము కలగచేసిన భూమి వినాగా మిగిలిన ప్రదేశామంతా బ్రహ్మాండములో జలమయముగా వున్నది గనుకనున్ను ఆ జలరాశి సమూహానకు సమిష్టి పేరు సముద్రము గనుకనున్ను సముద్రము వొకటే గాని అనేక సముద్రములు వుండనేరవు. అయితే