పుట:Kasiyatracharitr020670mbp.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వున్నది. వీరికి అధికారము యివ్వక విధిలేదు. యిచ్చినందువల్ల లోకులకు హింసగా వున్నదని వ్యసన పడుకున్నాడు.

యు దేశములో బంట్రౌతులు మొదలుగా గల శిరస్తా వుద్యోగస్థుల వరకు జీతములు బహు స్వల్పము గనుక లోకులవద్ద లంచాలు నిండా తీస్తారని గయా మేజస్ట్రేటుదొర మేస్తరు జాకుసన్ దొరతో మాట్లాడునప్పుడు ప్రసక్తివచ్చి అప్పుడు వారి చెప్పినది యేమంటే; పిడికిళ్లతో యెత్తి యీ దేశములో అధికారస్థులకు లోకులు లంచాలు యిచ్చేవాడికె పడియున్నందున జీతాలు మీ దేశమువలె యెక్కువచేసినా అధికారస్థులు అడకక పోయినా వాడికె ప్రకారము లొకులు తెచ్చియివ్వలసినదాన్ని యిస్తూ వస్తున్నారు గనుక అప్పట్లో కుంఫిణివారికి యెక్కవజీతము యిచ్చేనష్టము ఒకటేగాని యెవరికి క్షేమముండ నేరదని చెప్పినాడు. బరకందాసు అనే వొక ఠాణాబంట్రౌతులకు యిక్కడ జీతము నెల 1 కి నాలుగురూపాయిలు. వాడి గుర్రము వగయిరాలకు మాత్రము నెల 1 కి 10 రూపాయలు సెలవు వుంటూ వున్నది. యిక్కడ జిల్లామేజస్ట్రేటు నాజరుకు సుమారు నల 1 కి నూట్కి తక్కువలేక వస్తూవున్నది. హిందుస్తానులో జుడైసైయాల్ లయనులో నల్లవాండ్లలో నాజరు వుద్యోగము సర్వోత్తమ మని నిశ్చయిముచేసినాను.

యిక్కడ సకల కచ్చేరలలోనున్ను లెక్కలు వగయిరా వ్రాసే భాష ఫాషీన్. యింకా యిక్కడా వ్రాశే అక్షరములు శానా విధములుగా వున్నవి. ఒకరికి వ్రాయ చదవ తెలిసినది మొరొకరికి తెలియదు గనుక జాబులు మూలకముగ పనులు జరుగడము ప్రయాస. ఫార్శి లిపిమాత్రము సర్వమధ్యస్థముగా వున్నది. యిక్కడ వ్రాశే లిపుల ఖుల్లసు యేమంటే మహాజని యని సాహుకార్ల లిపి వొకటి. బ్ర్రాహ్మణీ అని బ్రాహ్మలు గ్రంధాలువ్రాశే లిపి ఒకటి, మోడి అనే మహారాష్ట్రపు లిపివొకటి, మారువాడి అని మారువాడీలు వ్రాసే లిపివొకటి. ఇంకా కొన్నిలిపులు వున్నట్టు తోచుచున్నది. మగధ దేశములో మాగధి అని వొక భాష గయావళీలు అంతరంగముగా మాట్లాడు కొంటారు.