పుట:Kasiyatracharitr020670mbp.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జాంగీరునుంచి కహలుగాముము వచ్చేలోపల భాగల్పూ రనే జిల్లాకసుబా గొప్ప షహరు వొకటి వున్నది. అక్కడ కలకటరు మొదలయిన అధికారస్థులు నివాసముగా వుండి వున్నారు. ఆ వూరి వద్ద నుండే గంగాధార యీ దినాలలో లోతు చాలనందున ఆ వూరికి వుత్తరముగా వుండే పద్ద ధారలో యీ బజరాలు వస్తున్నవి గనుక దూరపుదృష్టి మాత్రము ఆ వూరిమీద కలిగినది. యీగంగధారలను యీ పడవవాండ్లు దరియ్యా లంటారు. జలధార తక్కువయితే యె దరియ్యా మరుగయా అంటారు.

17 తేది గురువారము పడమటిగాలి అనుకూలముగా కొట్టి నందున యీ దినము వుదయము మొదలు అస్తమానము లొపల 24 కోసుల దూరము మా బజరా సాగి వచ్చినందున రాజా మహాలు అనే గొప్ప వూరు చేరినాము. యీ వూరిలో నీలిమందు చేశే దొరలు మాత్రము నివాసముగా వున్నారు. యీ వూరివద్ద గంగలో రాళ్ళు వున్నవి. పడవలు జాగ్రత్తగా రావలసినది. యీ వూరు తోపులు, తోటలతో నిండి వున్నది. వొక మశీదు వున్నది. అది తురకల భక్తిని ఆకర్షించే పాటిగా పురాతముగా వుండి వున్నది. పూర్వికపు రాజులు *కట్టినది వొక నల్లరాటి మహలి శిధిలమై యున్నది. సకల పదార్ధాలు దొరుకును.

పట్నా అనే షహరు విడిచిన వెనక శోధన చూడవలెననే వేషముతో సుంకపు చౌకిదార్లు యెవరున్నూ మా బజరాలవద్దికి చిన్నపడవలు వేసుకొని రావడములేదు. వారిని యిక్కడి కష్టం కలకటరులుపోయి వస్తూవుండే పడవలను నిండా తొందరపెట్టకుండా తాకీదు చేసినట్టు తోచుదున్నది. సుంకపువాండ్లు యీ దేశములో లోకులను చేసేతొందర అధికారస్థు లయిన దొరలకు తెలుసును. కాశిలో వుండే బ్రూక్కుదొర యీప్రసక్తి నాతో మాట్లాడే టప్పుడు ఈలాగే మాదేశమైన యింగిలాండులోనున్ను సుంకపువాండ్లవల్ల తొందర కలిగి


  • ఔరంగజేబు చక్రవర్తి సోదరుడు షూజా క్రీ.శ. 1630 లో దీనిని కట్టె నని బిషప్ హెబరు వర్ణించినాడు.