పుట:Kasiyatracharitr020670mbp.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ స్త్ఘలము చుట్ట్లున్ను అడివి బిల్వ మయముగా వున్నది. యీ దేశములోనున్ను ముఖ్యముగా బగాళీలున్ను, యెండకాలములో బిల్వపండ్లు షర్బత్తుచేసి బహుశ: తాగుతారు. ఈ దేశపు బిల్వపండ్లు బహు గొప్పలుగా వున్నవి. పండిన వెనక బహుమాధుర్యముగా వుంచున్నవి. యీ బిల్వపండలు నిమిత్తము బిల్వచెట్టుకు బహుకట్టు చేశియున్నారు. యీ చెట్ల కిందికి మనుష్యులను పోనివ్వరు. యీ జాంగీరువద్ద నొక తోటలో బిల్వచెట్టు పనసచెట్టు కాచివుండగా నా మనుష్యులు పనసాకులు కొయ్యపోతే పనసచెట్లనువిరచినా సమ్మతించినారుగాని పూజకు రెండు నిల్వదళములు కొయ్యనిచ్చినవారు కారు. యీ జాంగీరు స్థలములో అమావాస్య ఆదివారము ఘటనమైనది గనుక ఆ దినమునకు మరునాడు అమావాస్య సోమవార వ్రత మిక్కడనే గడిపి సోమవారము మధ్యాహ్నము బయలుదేరి సాగివచ్చినాను.

మార్చి నెల 16 తేది కహలుగాం అనే గొప్పవూరుచేరినాను. యీ వూరివద్దను గంగమధ్యే రెండు చిన్న కొండలున్నవి. ఆకొండల మీద మానుషసంచారము లేదు. అడివి పెరిగియున్నది. ఈ వూళ్ళో అన్ని పదార్ధాలున్ను దొరుకును. మయిధిలి బ్రాహ్మణులు, కనోజాబ్రాహ్మణులు 40 యిండ్లదాకా యున్నారు. కరివేపాకు మన దేశము వదిలిన తరువాత అక్కడక్కడ ప్రయత్నముమీద దొరుకుతూ వచ్చినది. ఈ వూరిలో ప్రతిపెరటిలోనున్ను కరివేపాకుచెట్లు కొల్లగా వేసి యున్నారు. కొత్తమల్లి మనిషిపొడుగున యీ దేశాములొ గడియ దూరము దాకా పరిమళింపుచు పయిరు అవుచున్నరి. యీ ధనియాలు కునుంబా చెట్లతో కలిపి అభిని చెట్లతొ కూడా నున్ను ప్రత్యేకముగా పొలాలలో నున్ను చల్లుతారు.

మూంగేరి మొదలుగా గంగకు యిరుపక్కలలో పర్వత దర్శనము అవుతూ వున్నది. బజారాలో వచ్చేటప్పుడు ఆ పర్వతాలు వొక పక్క నుండేవయినా నాలుగు పక్కలా తిరుగుతూ వుండేటట్టు స్థిరముగా నుండే సూర్యుడు భూచలనముచేత వొక పక్కనుండి వక పక్కకు వచ్చేటట్టుతోచే లాగు అగుపడుచున్నది.