పుట:Kasiyatracharitr020670mbp.pdf/292

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వంటి సిద్ధులకు నిమిత్తములయిన వస్తువులను స్వాధీనము చేసుకోవలనని వృధా ఆశపడి నిమిత్తము మాలిన భ్రమప్రమాద మైన పనులు చేయడము అతి వ్యర్ధమని నిశ్చయము చేసినాను.

యీ దాతా వైధ్యనాధ స్వరూపముగా వుండే పరమాత్మునికి శివరాత్రి దినమున సపాదలక్ష అనే లక్షాయిరువై అయిదువేల గంగ కావిళ్ళకు తక్కువ లేకుండా లొకులు తెచ్చి కామ్యార్ధముగా అభిషేకముచేస్తే యిష్టసిద్ధి అవువున్నదని యీ హిందూస్తాన్ లో బహు ప్రసిద్ధి. ఆ పంచకావిళ్ళు యేదే దంటే గంగోత్తరి, గంగా సాగర సంగమము కావిళ్ళు రెండు; హరిద్వారమువద్ద యెత్తే గంగకావడివొకటి; ప్రయాగలో యెత్తే కావడి వొకటి; యీ జాంగీరువద్ద యెత్తే గంగకావడి వొకటి; అంతు కావిళ్ళు అయిదు.

యీదాతావైద్యనాధస్థలముయొక్క కధయేమంటే పూర్వకాలమునందు రావణాసురుడు కైలాసానకు వెళ్ళి శివుణ్ని నాలంకలో నీవు వసించవలనని ప్రార్దించి నట్టున్ను శివుడు మంచిదని ఒకలింగములో మూర్తీభవించి నన్ను దిగువపెట్టకుండా నీలంకకు యెత్తుకొని పొమ్మని చెప్పినట్తున్ను విష్ణువుకు యీ వర్తమానము తెలిసి లోక సంరక్షణ పనికి నియమింప బడ్డ వాడు గనుక యీ తామసగుణ ప్రధానడయిన రావణుని సమీపమందు శివుడు వసిస్తే వీడు మరీ శివప్రసాదము కలిగే కొద్దిన్ని సాధులను బాధపెట్టు ననే భయముచేత వుదకాధిపతి అయిన వరుణుని ప్రేరేపణ జేసి రావణుడు యీ జాంగీరువద్ద గంగ దాటి అడివి మధ్యే పోతూవుండగా రావణునికి జలబాధ బహుశా కలిగేటట్టు చేసి తాను వృద్ధ బ్రాహ్మణుని వేషము వెసుకొని ఆ లింగము తీసి వుంచుకొని రావణుడు జలబాధ నివృత్తి చేసుకుని వచ్చేలోపల ఆ అరణ్యములో పెట్టి వెళ్ళీనట్టున్ను ఆ లింగాన్ని పెల్లగించడానికి శక్తిలేక లంకకు వెళ్ళిపోయినట్టున్ను, పిమ్మట వైద్ది అనే గోపాలకుడు కాళహస్రి కన్నప్పవలెనే అతిమూర్ఖమయిన భక్తితో ఆరాధన చేశినట్తున్ను ప్రసిద్ధి గలిగి యున్నది.