పుట:Kasiyatracharitr020670mbp.pdf/285

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వచ్చిన బోయీలు బంట్రౌతులు వగయిరా శూద్రుల చేతనున్ను ఏకోద్దిష్టమనే గయావ్రజనము చేయించినాను.

యీ గయామహాక్షేత్రము రాజా మిత్రజితశింగు అనేవాడి జమీందారితో చేరినది. వారి నివాస్థలము టంకారి అనే వూరు, గయకు పదికోసుల దూరములో వున్నది. యితను బహు సంపత్తుగలిగి యున్నాడు. యితని జమీందారికి యితడు కుంఫిణీకి కట్టే రూపాయలు సాలు 1 కి మూడు లక్షలు యితని రాజ్యములో యితనికి యాభై లక్షల రూపాయలు సునాయాసముగా కనుబడి అవుచున్నది. యిదే రీతిగా యీ ప్రాంత్యాల వుండే జమీందారులంతా అపరిమితమయిన లాభమును అనుభవింపుచు సుఖముగా నున్నారు. యింత లాభమునకు కారణ మేమంటే యాభై అరువై యేండ్ల కిందట యీ హిందూస్తాన్ రాజ్యము కుంఫిణీ వారికి స్వాధీనము కాగానే నాలుగు పక్కల శత్రుసమూహాలు నిండివుండెను గనుక రాజ్యములు తమ స్వాధీనానికి వుపర్యుపరిగా వచ్చేకొరకున్ను వచ్చిన రాజ్యము పరాక్రాంతము గాకుండా స్వాధీనములో వుండేకొరకున్ను లార్డు కారన్ వాలీసుగారి వుత్తర్వుమీద అప్పట్లో యీ జిల్లాలకు వచ్చిన కలకటరులు పూర్వము వున్న జమీందారులకే యావత్తు భూమినిన్ని తేలికెగా జమాబంది యేర్పరచి యుద్ధప్రసక్తులు తమకు కలిగి నప్పుడు మంది మార్బలములతొకూడా (కాలు బలము)కావలసిన రస్తుసామగ్రీలను ప్రతి జమీందారుడ్లున్ను కుమ్మక్కు చేయవలెనని వొక ఖరారు చెసుకొని భూమిని జమీందారుల వశము ఛెసినారు. అటువంటి సయాయములు వీరివల్ల కుంఫిణీ వారికి యీ వరకు నిమిత్తము లేకుండా తమ పరువుకు కావలసినంత శిబ్బందిని వుంచుకొని గజాంతైశ్వర్యములు జమీందారు లందరున్ను అనుభవింపుచు కాలము తోయుచున్నారు.

యిక్కడి భూమివాటము మామిలియతు వాటము, రహితుల క్షేమము వారి ప్రారాపత్యాలఖుల్ల నున్ను యేమంటే యీ హిందుస్తాన్ లో భాను అని ఒక భూమి కొలతకర్ర కద్దు. ఆభాను అనే వెదురు