పుట:Kasiyatracharitr020670mbp.pdf/284

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


క్రమము: శేరు 1 కి సుమారు యెత్తు ర్పు 80. దాన్ని 20 గండాలు అనుచున్నారు. గండా అనగా 4 రూపాయల యెత్తు, కొన్ని తావులలో శేరు 1 కి 18 గండాలు; కొన్నితావులలో 24 గండాలుగల శేరు వున్నది. కొన్ని తావులలో 22 గండాలుగల శేరు వున్నది. యీ గండాలు శేర్లు 1 కి ఎన్ని అని తెలుస్కున్ని వస్తువులు బేరము చయవలసినది. మణుగు 1 కి 40 శేర్లు, శేరు 1 కి చికాకులు 16. అంగళ్ళలో వుండే తూనిక గుండ్లు యేవంటే శెరు అనే గుండును, పక్కాశేరు అనే అయిదు శేర్లగుండు 1, చికాకులగుండ్లు కొన్ని కొన్ని వున్నవి. కట్టెలు, బియ్యము మొదలయిన గొప్పతూనికెలు మణుగు పండ్లతో తూచుదున్నారు.

పంచగయలు చేసే క్మర మేమంటే ఫల్గునీ శ్రాద్ధము యధాప్రకారముగా ముందర ఛేసి పయిన వ్రాసిన పంచతీర్ధాలలో పిండప్రదానములు చేసి అటుతర్వాత మూడోదినము విష్ణునదీ శ్రాద్ధము పయిన వ్రాసిన రప్రకారమే వెరవేర్చి నాలుగోదినమందు విష్ణుపాదపు గుళ్ళోనే మరివొక వటవృక్షము వున్నది. గనుక అక్కడి దర్మశాలలో శ్రాద్ధము చేసి ఆ వటవృక్షము కింద పిండప్రదానము చేసి గయావళీవద్ద సుఫలము పుచ్చుకోవలసినది. ఏకోద్దిష్ణము చేసేక్రమము మొదటి దినము ఫల్గునీశ్రాద్ధముచేసి రెండోదినము విష్ణుపదీ శ్రాద్ధముచేశి విష్ణుపాదము మీద పిండప్రదానము కాగానే గయావళీవద్ద ఆ విష్ణుపాదము వద్దనే సుఫలము పుచ్చుకోవలసినది. ఫల్గునీ శ్రాద్ధము చేయవలసిన క్రమ మేమంటే ఫల్గునీశ్రాద్ధము మాత్రము ప్రధమదినము చేశి ఫల్గునిలో పిండప్రదానము కగానే గయావళీ వద్ద ఫల్గునీనదిలో సుఫలము పుచ్చుకొని పిండములు ఫల్గునీనది చెలమలలో కలిపి వెయ్యవలశినది. యీ నాలుగు క్రమములుకాక వేరేవిధమయిన గయాప్రజనక్రమము లేదు. గనుక నాతోకూడావచ్చిన బ్రాహ్మణ మండలిచేత నంతా అష్టగయా వ్రజనము చేయించి, గయావ్రజనము ఛేయను శక్తిలేక గయలో కాచి యున్న ద్రావిడ దేశస్థులయిన బ్ర్రాహ్మణులచేతనున్ను, నాతోకూడా