పుట:Kasiyatracharitr020670mbp.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కూడావస్తాడు. ప్రేత పర్వతమునకు వచ్చేవాడు రెండు తావులలో పిండ ప్రదానము చేయవలసినది. యీ కొండకు సుమారు మున్నూరు మెట్లు కలవు. యెక్కడము ప్రయాస; సవారి మీద పోదామంటే కొండపయిన స్నానికి వుదకములేదు గనుక నడిచిపోవలసినది. ఆ కొండమీదికి నిమిత్తము లేనివారిని సర్కారు మనుష్యులు పొనియ్యరు. వుపచారము చేశేవాడు కూడా వస్తే వాడికి వేరే అమరాహి అనే వొక చీటి మూడున్నర రూపాయి యిచ్చి తీసియ్యవలశినది. భార్య మొదలయిన వారు కూడా వస్తే వారికి వేరే ఛీట్లు మూడున్నర రూపాయి వంతున యిచ్చి తీసుకోవలసినది. కొండమీద స్వర్ణరేఖ ఒక శిలామంటపము కిందవున్నది.

ప్రేతగయావళీలు అనే వక తెగవారు వుంటారు. వారు పిండదాన కాలమందు శానా తెమ్మని తొందర పెట్టుతారు. అష్టగయకు రెండురూపాయలు వారికి క్లిప్తము (నిర్ణయము). అంతమటుకు యిచ్చితీరవలెను. యీ ప్రేత గయావళీలు సుఫలము యివ్వడమని వొక సంప్రదాయము. ఈ ప్రేత గయావళీలు సుఫలము యిచ్చేక్రమ మేమంటే, పిండప్రదానము కాగానే భం అనే పేరుతో చెయితిప్పి నోరుకొట్టుకొని మీపితృలు స్వర్గస్థులయినా రని చెప్పవలసినది. అక్కడ పిండప్రదానము కాగానే మడుగు నిమిత్తము లేదు గనుక స్త్రీలతో కూడా సవారీల మీద యెక్కి కొండ దిగి వచ్చినాను.

యీ ప్రేతగయావళీలు గయావళుల అక్రమసంతు అనే వొక మాట వాడుకుంటారు. అసలు గయావళీల ఉత్పత్తి పయిన వ్రాసినప్రకారము బ్రహ్మయాగార్ధము ఋత్విక్కులను సృష్టించి నారని వ్రాసివుంటే గదా. వీరు ఆ ఋత్విక్కుల సంతువారని యీ గయావళీలను బ్రహ్మకల్పితబ్రాహ్క్మణు లని వారిపూజా కాలమునందు వచింప బడుచున్నది. బ్రహ్మ యాగము పూర్తికాగానే సమస్తమున్ను కావలశినమట్టుకు వీరికి యిచ్చి నప్పటికిన్ని మళ్ళీ బ్రహ్మను చాలదని యాచించి నట్తున్ను, బ్రహ్మకు కొపమువచ్చి మీకు యిచ్చినది సమస్తమున్ను వ్యర్ధమై పోగాకా అనిన్ని, మీరు విద్యారహితులై దరిద్తురులైపోదురు గాకా అనిన్ని