పుట:Kasiyatracharitr020670mbp.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బాగా వుంచున్నది. మన దేశములో యీ మొగ్గలు వున్నా వికసించినవనక అర్చనకు వాడుతాముగాని మొగ్గలను భక్ష్యయోగ్యముగా వాడడములేదు. యిక్కడి దూదుప్యాడాలు ప్రసిద్ధి కలిగి దినాల పేరట వుంచున్నవి, వీధులు కాశీ అంతటి కుసంది కావు. జాహేబు గంజువీధులు దక్షిణ దేశములోని వీధులకు సరి పోలి వున్నవి. యిండ్లు నాలుగు అంతస్తులుదాకా కొయ్యసామాను వేశి మజుబూతి (గట్టి) మిద్దేలుగా కట్టి వున్నారు.

యీ క్షేత్రముచుట్టు కొండలు వుండడము మాత్రమేగాక షహరుమధ్యే కూడా చిన్న తిప్పలు వున్నవి. ఆ తిప్ప మిట్టలమీదనే యిండ్లు కట్టియున్నారు. సమీప మందున్న ఫల్గుని నదిని ఇక్కడి దేశస్థులు ఫల్గు అనుచున్నారు. బహుశ: వడల్పు కలిగి బహుదూరము ప్రసిద్ధి కెక్కియున్నా ప్రవహింపుచు వుండే దినాలు బహు కొద్ది గనుక అందులో యెక్కడ చూచినా చలమలుతీసి స్నాన పానాలు గడుపుకుంటూ వుంటారు. యీ చలమల విషయమయి యీ షహరుని వాసుల ఖర్చులు విస్తారముగా ప్రతి నెలకు తగులుతూ వచ్చుచున్నది. గదాధరస్వామి సన్నిధిలో వుండే ముఖ్య చలమ వుదమకు కూపోదక మర్యాదగా వుష్ణకాలానకు శీతముగానున్ను శీతకాలానకు వుష్ణముగాను వుంచున్నది. గయావళీల యిండ్లు---1000 చిల్లర అని ప్రసిద్ధి అయి వున్నా 700 యిండ్లు హాజరుగా వున్నవి. గౌడబ్రాహ్మణుల యిండ్లు శానా వున్నవి. మహారాష్ట్రులు ఆంధ్రులు కలిశి ముప్పై యిండ్ల దాకా వున్నారు. పంచద్రావిళ్ళలో నూటిదాకా బ్రాహ్మణ మండలి చేరుతున్నవి. వారికి జీవనము షోడశీ అనే పౌరొహితము. వారు గయావళీలను వుపసర్పించుకొని వుంటారు. వారి ఆజ్ఞానుసారముగా వచ్చినవారి గయాప్రజనాలకు పౌరోహితము చేయిస్తారు. వారికి క్లిప్తములు (నిర్ణయములు) యేర్పడి యున్నవి. అందుకు తక్కువ యాత్రవారివల్ల పుచ్చుకొరు.

యిక్కడ గయాప్రజనాలు చేసే క్రమాలు నాల్గు. అష్టగయా అనే గయావ్రజనము ముఖ్యమున్ను ఖర్చుయెక్కువ పట్టేదిన్ని; పంచగయా అనేది రెండోపక్షము. యేకోద్ధిష్ట మనేది మూడోపక్షము.