పుట:Kasiyatracharitr020670mbp.pdf/265

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వున్నది. వూరివద్ద ఒక చిన్ననది ప్రవహించుచున్నది. నదివొడ్డున లోగడె మజిలీవలెనే హిందువులకు ఒక సరాయి, జారులవారికి ఒక బంగళా కట్టివున్నది. బరక్రదాసు అనే పోలీసు బంట్రౌతు ముసాఫరుల సరఫరాయి నిమిత్తమున్ను కాపు నిమిత్తమున్ను సరాయి బంగాళాలవద్ద కాచియుంటాడు. యీ గొప్ప వూరిలో వంటచెరుకులు ప్రయత్నము మీద దొరికినవి. యీ రాత్రి యిక్కడ వసించినాను.

3 తేది 7 ఘంటలకు బయలువెళ్ళీ యుక్కడికి 8 కోసుల దూరములోవుండే చెలాయనే యూరు 2 ఘంటలకు చేరినాను. దారినిన్నటిదారివలెనే బాగావున్నది. ఈవూరిలోను సరాయి బంగాళా వున్నప్పటికిన్ని సరాయిలో మనుష్యులు నిండి యున్నందుననున్ను కాశీ పట్టణము మొదలుగా ప్రతి జిల్లా మేజస్ ట్రేటు వారు వారి సరిహద్ధు పరియంతమున్ను చప్రాశి అనే ఒక బిళ్ళ బంట్రౌతును దయచేశియిస్తూ వున్నందున, కూడావున్న తయినారి బంట్రౌతు గుండా ఆవూరిజమీందారుణ్ని పిలుపించి వాడియింటిని ఖాలీ చేయించి అందులో దిగినాను. యీ వూరు గొప్పవూరేను. సకల పదార్ధాలు దొరుకును. జలవసతి నిండాలేదు. యీ వూరిలో యీరాత్రి ససించినాను.

4 తేది ఉదయ మయిన 7 ఘంటలకు ప్రయాణమై యిక్కడికి 10 కోసుల దూరములో వుండే గయామహాక్షెత్రము 2 ఘంటలకుచేరినాను. కాశిలోవుండాగానే డౌలత్తురావు శింధ్యా గయావళి సహదేవ భయ్యా స్వీకారపుత్రుడయిన చోటాలాలు భయ్యా యోగ్యుడని తెలిసినందున ఆ చిన్నవాణ్ణి కాశికి పిలుపించినాను. అతడు రాజసల్తనతో కూడా నావంబడి ఒక బజరాచేసుకొని పట్నాషహరుకు వచ్చి అక్కడి నుంచి కూడా గయకు మజిలి మరుమజిలీగా నాతోకూడా భోజనము చేసుకొంటూవచ్చి ముందర దిగడానకు విష్ణుపాదము గదాధరస్వామి గుళ్ళకు ఫల్గుణీనదికిన్ని అతి సమీపముగా ఒక గొప్పయిల్లు కుదుర్చి పెట్టినందున అందులో దిగి, యీశ్వర కటాక్షముచేత నాగయావళీ ఉపపన్నుడయి బ్నహుశ: యింగిత జ్ఞానము తెలిసి గదాధర భట్లు అనే దేశస్థ బ్ర్రాంహ్మణుని తనవద్ద సర్వాధికాగానున్ను ప్రాపకుడుగానున్ను వుంచుకొని వున్నాడు. గనుక సకల విధాల ఆ క్షేత్రము నాస్వస్థ